ఇండియన్ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ఎంఎస్ ధోనికి పేరుంది. కెప్టెన్‌గా భారత్‌కు రెండు (వన్డే, టీ20) వరల్డ్ కప్‌లను అందించిన ఘనత ధోనికే దక్కుతుంది. అన్ని విభాగాల్లో టీమిండియాను తిరుగులేని శక్తిగా మార్చిన కెప్టెన్.. ధోని. కొడితే ఫోర్లు లేదంటే సింగిల్స్ అంటూ సాగే టీమిండియా బ్యాటింగ్ శైలిని పూర్తిగా మార్చి.. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తి పరుగులు పిండుకునే టెక్నిక్‌ను అలవాటు చేసిన అథ్లెట్.
వికెట్ కీపింగ్‌ను ఇంత స్టైలిష్‌గా కూడా చేయొచ్చా అని చేసి చూపించిన ఘనుడు.. ప్రపంచ క్రికెట్‌కు హెలికాప్టర్ షాట్‌ను పరిచయం చేసిన క్రియేటర్.. మ్యాచ్ ముగించడంలో కొత్త ఒరవడిని సృష్టించిన బెస్ట్ ఫినిషర్ ధోని. అలాంటి వ్యక్తికి ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో అభిమానులు ఉండటం సహజం. అందులో మన తెలుగువారు కూడా లక్షల్లో ఉంటారు. కానీ.. మన వాళ్లు అభిమానం చాటుకునే స్టైలే వేరు. ధోని అభిమానులంటే ఆ మాత్రం ఉంటుంది.. అనే రేంజ్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ధోనికి 41 అడుగుల కటౌట్ ఆయన అభిమానుల ఏర్పాటు చేశారు. జూలై 7 గురువారం ధోని పుట్టిన రోజు సందర్భంగా ఈ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశాడు.
అలాగే ఈ పుట్టిన రోజుతో ధోని 41వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగానే 41 అడుగుల కటౌట్‌ను ఏర్పాటు చేశారు. 2011 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ధోని సిక్స్ కొట్టి మ్యాచ్ గెలిపించిన షాట్ స్టిల్‌ను ఈ కటౌట్ కోసం ఎంచుకున్నారు. సిక్స్ కొట్టి బాల్ వైపే చూస్తుండే ధోనిని ఈ కటౌట్‌లో చూడొచ్చు. ప్రస్తుతం ఈ భారీ కటౌట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఏ విషయంలో అయినా అభిమానం చాటుకోవాలంటే బెజవాడ కుర్రోళ్ల స్టైలే వేరంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
41 feet cutout of MS Dhoni for his 41st birthday in Vijaywada District. pic.twitter.com/bj9JFa4EeL
— Johns. (@CricCrazyJohns) July 5, 2022
Most celebrated Cricketer 👑💥@MSDhoni #MSDhoni #WhistlePodu pic.twitter.com/w9ag6PSECO
— DHONI Era™ 🤩 (@TheDhoniEra) July 6, 2022