ఏపి రాజకీయాల్లో ఎంపీ రఘురామ కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తన సొంత పార్టీపైనే తిరగబడిన ఆయన.. జైలుకు వెళ్లిన విషయం కూడా తెలిసిందే. ఇక తాజాగా రఘురామ కృష్ణంరాజు ఓ ప్రముఖ ఛానల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించారు. గతంలో తన పార్టీ అధినేత విషయంలో కొంత మంది కీలక నేతలు అతి జోక్యం చేసుకోవడం వల్ల ఆయన పై ప్రభావం పడుతుందా అన్న చిన్న భావన ఉండేదని.. కానీ వాళ్ళు చేయడానికి ఏమీ లేదని.. ఆ అధినేత అసలు విషయం తెలుసుకున్న తర్వాత జ్ఞానోదయం అయ్యిందని అన్నారు. ఇక ముందు ఎవరి జోలికి వెళ్లనని.. ప్రజా సమస్యలపై తాను పోరాడతానని అన్నారు.
ప్రజలు పడుతున్న కష్టాలను రచ్చబండ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తానని అన్నారు. వరద సహాయక చర్యల్లో పరదాలు.. విమానాల్లో సరదాలు మాత్రమే జరుగుతున్నాయి. వరద బాధితుల్లో కొంత మంది తమ పార్టీవాళ్లు చెప్పినట్లు పప్పు.. ఉప్పు వచ్చాయని చెప్పించడం.. తర్వాత సీఎం ఒక చిరునవ్వు నవ్వి సెల్ఫీలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా.. పాదయాత్ర సందర్భంగా సీఎం జగన్ ప్రజలకు ఇచ్చిన మాటలే నెరవేర్చమంటు ప్రతిరోజూ చెబుతూ ఉన్నా.. గతంలో మద్యపాన నిషేదం గురించి ఆయన ఏకరువు పెట్టిన తీరు.. తర్వాత దానిపై మీరు తీసుకు యూటర్న్ తీసుకొని ఏకంగా జీవోనే ఇచ్చారు.
ఇక పార్లమెంట్ లో ఈ విషయం గురించి మాట్లాడుతుంటే.. తనతో కొంత మంది గొడవ పెట్టుకున్నారని.. ఆ సమయంలో కూర్చోరా లం..** కొడకా అని తన పార్టీ నాయకుడే అంటే అతనికి సదరు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారని.. అసెంబ్లీలో తనని ఓ నాయకుడు లుచ్చా అంటే అని తిడుతుంటే మురిసిపోవడం చాలా బాధ అనిపించిందని అన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా రఘురామ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.