రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ శభాష్ అనిపించుకునే పని చేశారు. ఓ నిండు ప్రాణాన్ని కాపాడి అందరి చేత సలామ్ కొట్టించుకున్నారు.
సాధారణంగా నేటి రాజకీయ నాయకుల్లో కొంత మంది ఎన్నికలు జరిగిన తర్వాత మోహం చూపించడం మానేస్తారు. కానీ కొందరు నాయకులు మాత్రం నిత్యం ప్రజలతోనే ఉంటు వారి కష్టనష్టాల్లో పాలుపంచుకుంటుంటారు. ఈ క్రమంలోనే రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ శభాష్ అనిపించుకునే పని చేశారు. ఓ నిండు ప్రాణాన్ని కాపాడి అందరి చేత సలామ్ కొట్టించుకున్నారు. గోదావరిలో దూకబోయిన ఓ యువకుడిని చాకచక్యంగా కాపాడాడు రాజమండ్రి ఎంపీ భరత్. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉనకరమిల్లి గ్రామం నిడదవోలు మండలానికి చెందిన అయ్యప్ప తాడేపల్లిగూడెంలోని శశి ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ పూర్తి చేసి మూడు సంవత్సరాలుగా జాబ్ చేస్తున్నాడు. అయ్యప్ప తండ్రి పేరు సీతాపతి. ఇక తన తల్లిదండ్రులకు ఆరవ సంతానంగా జన్మించినట్లు అయ్యప్ప పోలీసులకు తెలిపాడు. ఇక విషయం తెలీదుగానీ, ఏ కష్టం వచ్చిందో ఏమో గానీ అయ్యప్ప చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా బైక్ పై రాజమండ్రి-కొవ్వూరు రోడ్డు కమ్ రైలు వంతెనపైకి చేరుకున్నాడు. బైక్ పక్కన పెట్టి బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకేందుకు సిద్దం అయ్యాడు. అయితే సరిగ్గా అదే సమాయానికి గోపాలపురంలోని ఓ శుభకార్యానికి బయలుదేరిన రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కు ఈ దృశ్యం కంటపడింది.
దాంతో ఒక్క ఉదుటున కారులో నుంచి దూకి.. ఆ యువకుడి చొక్కా పట్టుకుని వెనక్కి లాగాడు. అనంతరం అతడితో కొద్దిసేపు మాట్లాడాడు ఎంపీ భరత్. అయితే నీకు వచ్చిన సమస్య ఏంటని అయ్యప్పను ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పాడు. కొద్దిసేపు అతడితో మాట్లాడిన తర్వాత.. రాజమండ్రి టూ టౌన్ సీఐ కు ఫోన్ చేశారు ఎంపీ భరత్. అయప్పకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం తన అనుచరులను కొంతమందిని అతడి వెంట పంపించాడు. ఇక ఎంతో చాకచక్యంగా ఓ యువకుడి ప్రాణాలు కాపాడిన ఎంపీ భరత్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు స్థానికులు. మరి ఓ యువకుడి ప్రాణాలు కాపాడిన ఎంపీ భరత్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.