వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను వివాదాన్ని రాజేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో విపక్షాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గోరంట్ల మాధవ్‌ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు అధికార పార్టీ నేతలు.. ఈ విషయంలో విచారణ జరుగుతోంది.. దాన్ని బట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో తాజాగా ఈ వివాదంపై స్పందించినందుకు గాను టీడీపీ నేత వంగలపూడి అనితకు విచిత్ర అనుభవం ఎదురయ్యింది. ఓ అజ్ఞాత వ్యక్తి అనితకు కాల్ చేసి..గోరంట్ల వ్యవహారంలో ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ప్రశ్నించాడు. గోరంట్ల ఏ తప్పు చేశాడని.. ఎక్కువ మాట్లాడుతున్నారని అడిగాడు.
అందుకు అనిత.. తాను వాస్తవాలు మాత్రమే ప్రజలకు అందిస్తున్నానని తెలిపింది. ఆయన ఏం తప్పు చేయలేదా అని అనిత సదరు వ్యక్తిని ప్రశ్నించింది. అందుకు ఆ వ్యక్తి తెలుగు దేశం నేతలు బుద్ధా వెంకన్న, బొండా ఉమల విషయంలో ఎందుకు నిలదీయడం లేదు అని ప్రశ్నించాడు. అంతేకాక మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి కదా అన్నాడు. అంతేకాక ప్రస్తుతం గోరంట్ల వ్యవహారం న్యాయస్థానంలో ఉందని.. దారుణాలు మాట్లాడవద్దని.. అతిగా స్పందిచాల్సిన అవసరం లేదని సదరు వ్యక్తి సదరు వ్యక్తి అనితకు సూచించాడు. అతడు కాల్ చేసి మాట్లాడుతుండగా.. అనిత మీడియా సమక్షంలో స్పీకర్ ఆన్ చేసి.. సదరు వ్యక్తి మాట్లాడే విషయాలను అందరికి వినిపించింది. మరి టీడీపీ నేత అనితకు కాల్ చేసిన వ్యక్తి ఎవరనేది తెలియరాలేదు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.