గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా కొనసాగుతునంది మాజీ మంత్రి వైయస్. వివేకానందరెడ్డి హత్య కేసు. ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించాడానికి ప్రయత్నిస్తున్నారని ఎంపీ అవినాశ్ రెడ్డి అంటున్నారు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ విషయంపై ఉత్కంఠ కొనసాతుంది.
గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది మాజీ మంత్రి వైయస్. వివేకానందరెడ్డి హత్య కేసు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎన్నో ట్విస్ట్ లు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే సీబీఐ విచారణ ముమ్మరం చేసింది.. అరెస్టుల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే వివేకా హత్య కేసు విషయంలో కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చు అన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో అవినాశ్ రెడ్డి స్పందించారు.. అసలు వివేకానందరెడ్డి చనిపోయిన రోజు ఏం జరిగిందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే..
వివేకా హత్య కేసు విషయం గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందంటూ ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు.. అనవసరంగా నన్ను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా సీబీఐ కి ఆయన పలు ప్రశ్నలు సంధించారు. అవినాశ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘వివేకా హత్య జరిగిన రోజు ఆయన బామ్మర్ధి శివ ప్రకాశ్ రెడ్డి ఉదయం 6.30 గంటలకు నాకు ఫోన్ చేశాడు.. అప్పటికే వైసీపీలోకి జీకే కొండారెడ్డి అనే వ్యక్తి జాయిన్ చేర్చుకునే కార్యక్రమానికి వెళ్తున్నా. పులివెందుల రింగ్ రోడ్డు వద్దకు రాగానే వివేకా నో మోర్ అంటూ శివ ప్రకాశ్ రెడ్డి కాల్ చేశాడు. వెంటనే నేను వివేకా ఇంటికి వెళ్లాను.. చనిపోవడానికి ముందు వివేకా రాసిన లెటర్, ఫోన్ గురించి ఆయన పీఏ కృష్ణారెడ్డి వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డికి చెప్పారని.. వెంటనే ఆయన వాటిని దాచేయాల్సిందిగా వివేకా పీఏకి ఎందుకు చెప్పారని ప్రశ్నించారు అవినాశ్ రెడ్డి.
‘డ్యూటీకి త్వరగా రమ్మన్నందుకు నా డ్రైవర్ నన్ను చితకబాదాడని.. లెటర్ రాయడానికి నేను చాలా కష్టపడ్డానని.. డ్రైవర్ ప్రసాద్ ను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టవొద్దని’ వివేకా రాసి ఉన్న లేటర్ ఈ కేసులో ఇదే కీలక ఆధారం అన్న విషయం సీబీఐ గుర్తించాలి, నేను లెటర్ ఎందుకు దాచిపెట్టారని రాజశేఖర్ రెడ్డి, సునిత లను అడిగాను.. వారు ప్రసాద్ ని ఏమైనా అంటారేమో అని లేఖ దాచామన్నారు.. మీ నాన్నను కాకుండా డ్రైవర్ ని నమ్ముతారా? లేటర్ విషయాన్ని నాకు, పోలీసులకు చెప్పలేదు.. అని ప్రశ్నించాను. ఇక ఆ లెటర్ పై సీబీఐ ఎందుకు ఫోకస్ చేయడం లేదు? ఎవరిని కాపాడటానికి ఇదంతా చేస్తున్నారు? హత్య అని తెలిసి కూడా ఆ లెటర్ ని దాచడం ఏంటీ? మీ వైపు తప్పు ఉంది కనుకనే లెటర్ దాచారు అన్నాను.. ఇదే విషయాన్ని నేను సీబీఐ కి చెప్పాను.. అన్నారు అవినాష్ రెడ్డి. సీబీఐ స్టేట్‌మెంట్‌లో సునీతా ఒక్కో స్టేట్‌మెంట్ ఒక్కో మాదిరిగా చెబుతుంది.. ఆ తర్వాత స్టేట్ మెంట్ లో తప్పులు కవర్ చేస్తుంది. తాను అలా అనలేదు.. మర్చిపోయానని చెబుతుంది.. సీబీఐ వాళ్లకు పూర్తి స్వేచ్చ ఇచ్చారు.. నేను సీబీఐ ని బ్లేబ్ చేయడం లేదు.. న్యాయం చేయమంటున్నాను అన్నారు అవినాశ్ రెడ్డి. పూర్తి వివరాల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.