బిడ్డలకు ఎటువంటి కష్టం రాకుండా చూస్తుంది. ఆకలి అని అడగకముందు అన్న పెడుతుంది. ఆలనాపాలనా చూస్తుంది. కష్టాలు తెలియకుండా పెంచుతుంది. మన తప్పులను కడుపులో పెట్టుకుని దాచుకుంటుంది.
అన్ని నొప్పులను భరించి, ఆయువు పోస్తుంది అమ్మ. అనురాగం పంచుతుంది. బిడ్డలకు ఎటువంటి కష్టం రాకుండా చూస్తుంది. ఆకలి అని అడగకముందు అన్నం పెడుతుంది. ఆలనాపాలనా చూస్తుంది. కష్టాలు తెలియకుండా పెంచుతుంది. మన తప్పులను కడుపులో పెట్టుకుని దాచుకుంటుంది. పిల్లలను మంచి భవితవ్యాన్ని ఇస్తుంది. అంతేకాకుండా బిడ్డల కడుపున పుట్టిన మనవళ్లను, మనవరాళ్లను కూడా సాకుతుంది. అలాంటి అమ్మను పూజించినా తక్కువే. కానీ ఆమె వృద్ధాప్య దశకు వచ్చే సరికి.. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అమ్మను నడిరోడ్డున వదిలేస్తున్నారు ఆమె పిల్లలు.
తనను నడి రోడ్డు మీద వదిలేసినా, తన కుమారుడిపై మాట పడకూడదని అతడి పేరు కూడా చెప్పలేదు ఆ తల్లి. అదే అమ్మ ప్రేమంటే. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళానికి చెందిన రత్న రాములమ్మ (70) ఏళ్ల వృద్ధురాలిని ఆమె కుమారుడు గురువారం ఉదయం బల్కం పేటలోని షాపింగ్ కాంప్లెక్స్ పక్కనున్న రహదారిపై వదిలేశాడు. ఆమె చేతిలో బట్టల మూట పెట్టి అక్కడి నుండి జారుకున్నాడు. మండుటెండలో ఆమె చాలా సేపటి నుండి ఒంటరిగా ఉండం చూసి చలించినపోయిన ఆశా వర్కర్ భాగ్య పలకరించారు. ఆమె వద్దకు వెళ్లి ఆకలి తీర్చి. వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తనను తన కుమారుడు ఇక్కడ వదిలేసి వెళ్లిపోయినట్లు చెప్పింది. అయితే తన పేరు, ఊరు చెప్పిందీ కానీ కుమారుడు పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. కాగా, రత్నరాములమ్మను భాగ్య ఎస్‌ఆర్‌నగర్ పోలీసులకు అప్పగించగా, వారు ఈసీఐఎల్‌లోని లార్డ్డ్ మాత హోమ్‌కు తరలించి ఆశ్రయం కల్పించారు. పేగు బంధాన్ని కాదని.. మానవత్వం మరిచి, తల్లిని అనాధలుగా రోడ్డు మీద వదిలేస్తున్న ఇటువంటి కుమారులను ఏం చేయాలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.