సమాజంలో ఆడవారికి ఆడవారే శత్రువన్నట్లుగా మహిళలకు అత్త, ఆడబిడ్డల నుంచి వేధింపులు ఎదురవుతుంటాయి. అదనపు కట్నం కోసం వేధించే వారిని మనం చూసే ఉంటాం. తాజాగా కోడలు, మనవరాలి పట్ల ఓ అత్త అమానుషంగా ప్రవర్తించింది.
సమాజంలో ఆడవారికి ఆడవారే శత్రువన్నట్లుగా మహిళలకు అత్త, ఆడబిడ్డల నుంచి వేధింపులు ఎదురవుతుంటాయి. అదనపు కట్నం కోసం వేధించే వారిని మనం చూసే ఉంటాం. చివరికి ఆపిల్లలకు జన్మచ్చినా, మగబిడ్డను కనలేదని రాచిరంపాన పెట్టే అత్తలు, భర్తలు ఉన్నారు. ఇదే తరహాలో ఓ అత్త తన కోడలిని, మతిస్థిమితం లేని మనవరాలిని ఇంట్లోనుంచి గెంటేసిన వైనం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ దారుణమైన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
విశాఖపట్నంలోని జయప్రకాశ్ నగర్ లో ఉండే జగన్ మోహన్, గౌరీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద కూతురు మానసిక వికలాంగురాలు. ఈ కారణం చేత భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. మానసిక వికలాంగురాలైన కూతురి వైద్యం కోసం అధికంగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోందని జగన్ మోహన్ భార్యతో గొడవపడే వాడు. చాలా కాలం పాటు గౌరీ భర్త వేధింపులు భరిస్తూ వచ్చింది. అయితే జగన్ మోహన్ భార్యాపిల్లలను విడిచి పెట్టి తన తల్లి అయిన రాజేశ్వరీతో కలిసి వేరే చోట నివాసం ఉంటున్నాడు.
భర్త విడిచి వెళ్లిన తర్వాత గౌరీ దేవి తన పిల్లలతో కలిసి ఓ ఇంట్లో ఉంటుంది. అయితే గౌరీదేవి మానసిక వికలాంగురాలైన తన కూతురును తీసుకుని వైద్యం కోసం డాక్టర్ వద్దకు వెళ్లింది. వైద్యం చేయించుకుని ఇంటికి వచ్చిన గౌరీదేవికి తన ఇంటకి తాళం వేసి ఉండడం చూసి ఆశ్యర్యపోయింది. తాళం ఎవరు వేశారని ఇరుగుపొరుగు వారిని అడిగింది. మీ అత్త వచ్చి ఇంటికి తాళం వేసి వెళ్లిందని స్థానికులు తెలిపారు. విషయం తెలిసిన గౌరీదేవి అత్తకు ఫోన్ ఫోన్ చేయగా ఆమె స్పందించలేదు.
చేసేది ఏమీలేక మండుటెండలో తాళం వేసి ఉన్న ఇంటిముందు తన పిల్లలతో కలిసి నిరసనకు దిగింది. విషయం తెలుసుకున్న పుట్టింటి వారు గౌరీదేవి వద్దకు చేరుకున్నారు. గౌరీదేవి పిల్లలతో కలిసి నిరసన చేస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి ఇంటి తాళం తీయించారు. ఈ చర్యకు పాల్పడిన అత్త, భర్తలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆడపిల్లల పట్ల వివక్షచూపించకుండా వారి ఎదుగుదలకు సహకరించి తోడ్పాటు అందించాలని పోలీసులు హితభోద చేశారు. మరి.. ఈ అమానుష ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.