తల్లిదండ్రుల ప్రేమ గురించి ఎంత చెప్పకున్నా తక్కువే. ముఖ్యంగా అమ్మ ప్రేమను మించిన ప్రేమ ఏదీ ఉండదు ఈ ప్రపంచంలో. బిడ్డ కోసం తల్లి ఎంతో విలవిల్లాడిపోతుంది.
అమ్మ అంటే ఓ అనుభూతి… ఓ అనుబంధం… ఓ ఆప్యాయత. బిడ్డకు బాధ కలిగిందన్న విషయం ముందు అమ్మకే తెలుస్తుంది. బిడ్డకు ఆకలి అవుతోందన్న విషయం ముందు అమ్మే పసిగడుతుంది. తన బిడ్డ విజయాలు సాధించినప్పుడు అమ్మ ఆనంద పరవశురాలవుతుంది. అందుకే అమ్మ పిచ్చి తల్లి. మనం బయట తిరిగి తిరిగి ఇంటికి వెళితే అమ్మం గుమ్మంలోనే నిలబడి మన కోసం కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తుంటుంది. అలా పంచ ప్రాణాలు పెట్టి పెంచిన బిడ్డ చనిపోతే.. ఆ తల్లి తట్టుకోగలదా? అస్సలు తట్టుకోలేదు.
బిడ్డ జ్ఞాపకాల్లో నిత్యం నలిగిపోతుంది. అలా చనిపోయిన బిడ్డ జ్ఞాపకాల్లో నలుగుతున్న ఓ తల్లి కొడుకు జ్నాపకాలు మరువలేక ఓ గుడినే నిర్మించింది. ఆ వివరాల్లోకి వెళితే.. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గ్రామంలో వీరమాచనేని శ్రీనివాసరావు, జగదీశ్వరీ దంపతులు నివసిస్తున్నారు. ఆ దంపతులకు 1997 లో రంజిత్ అనే కుమారుడు పుట్టాడు. ఆ బాబుకి చిన్నతనం నుంచే కంట్లో రెటీనా సమస్య ఉంది. ఆ సమస్య తో భాదపడుతున్న కుమారునికి సరైన వైద్యం అందించాలని అనేక రకాల హాస్పిటల్స్‌లో చూపించారు.
కొన్ని నెలల తర్వాత రంజిత్‌కు కంటిలో రెటీనా సమస్య నయం అయ్యింది. కొన్ని ఏళ్ల వరకు అంతా బాగానే వుంది. అయితే, రంజిత్‌కు 25 సంవత్సరాలు రాగానే సమస్య మళ్లీ తిరగబెట్టింది. రంజిత్ ఎంబీఏ చదువుతున్న సమయంలో రెటీనా సమస్య మళ్లీ తిరగబెట్టింది. దీంతో అతనిని ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అలా కొద్ది రోజులు చికిత్స పొందుతున్న సమయంలో కంటి సమస్య చంప నుండి గుండెకు చేరడంతో కంటి సమస్య ఎక్కువయిపోయింది. సమస్య కారణంగా రంజిత్ తల్లిదండ్రుల కళ్ల ముందే చనిపోయాడు. ఎదిగొచ్చిన కొడుకు దూరమయ్యాడని ఆ తల్లిదండ్రులు దు:ఖ శోకంలో మునిగిపోయారు.
అలా కొన్ని నెలలు గడిచాయి. అయినా కొడుకు జ్ఞాపకాలు వారిని విడవలేదు. దీంతో అతడి తల్లికి ఓ ఆలోచన వచ్చింది. ఆ విషయం భర్తకు చెప్పింది. ఆయన సరేనన్నాడు. దీంతో ఇద్దరూ ఆ పని చేయాలని డిసైడ్ అయ్యారు. వారు రాజస్థాన్‌లోని జైపూర్లో కొడుకు విగ్రహాన్ని తయారు చేయించారు. ఇందుకోసం మూడు లక్షల ఖర్చు పెట్టారు. తర్వాత పొలంలో ఏకంగా ఓ గుడి కట్టి అందులో కొడుకు విగ్రహం ఏర్పాటు చేశారు. అంతే కాదు.. రంజిత్‌ను ఇంటి ఇలవేల్పుగా భావించి అక్కడ నిత్యం పూజలు చేస్తున్నారు. తమ కొడుకు మీద ఉన్న ప్రేమను అలా చాటుకున్నారు. మరి, ఈ తల్లిదండ్రులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.