నవ మాసాలు ఎన్నో సంఘటనలు ఎదుర్కొని తన రక్త మాంసాలు పంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక, అమ్మను సృష్టించాడంటారు. అలాంటిది ఓ తల్లి తన కొడుకుని చంపేయండి అంటూ కోర్ట్ ని వేడుకొంటుంది. ఇంతకీ ఆ కొడుకు ఏం కష్టమొచ్చింది.. ఆ తల్లి అంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుంది.. గుండె తరుక్కుపోయే ఈ కన్నీటి గాథ అన్నమయ్య జిల్లాలో వెలుగులోకి వంచింది. వివరాల్లోకి వెళితే..
అన్నమయ్య జిల్లాకు చెందిన నౌహిరా అనే మహిళ తన తనయుడు మునీర్ తో కలిసి కొంత కాలంగా చిన్న చిన్న పనులుచేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. ఈ మద్య మునీర్ బాషా కి రెండు కిడ్నీలు చెడిపోయాయి. కొడుకును బతికించుకోవడం కోసం నౌహిరా ఎన్నో ఆసుపత్రులు తిరిగింది. కానీ మునీర్ పరిస్థితి మెరుగు పడలేదు. అయితే కిడ్నీలు మారిస్తే కానీ పిల్లాడు బతికే ఛాన్స్ ఉందని ఆమెతో వైద్యులు తెలిపారు. తన కొడుకును ఎలాగైనా బతికించుకోవాలని తన కిడ్నీ ఇచ్చేందుకు రెడీ అయింది. కానీ వైద్య ఖర్చు సుమారు నలభై లక్షలు అవుతుందని చెప్పడంతో ఆమె మదనపల్లి కోర్టుని ఆశ్రయించింది.
నలభై లక్షలు ఖర్చు పెట్టి తాను తన కొడుకుకి ఆపరేషన్ చేయించే పరిస్థితిలో లేనిన.. దయచేసి తన బిడ్డ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి లేదా కిడ్నీ ఆపరేషన్ చేయించండి అంటూ మదనపల్లి రెండో అదనపు జిల్లా కోర్టులో పిటిషన్ వేసింది. నౌహిరా పిటీషన్ పరిశీలించిన న్యాయమూర్తి వెంటనే జిల్లా కలెక్టర్ ని కలవాలని సూచించారు. తన కుమారుడి పరిస్థితి అర్థం చేసుకొని దాతలు ఎవరైనా ముందుకు రావాలని ఆమె ప్రార్థిస్తుంది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి : ఒకే ఆస్పత్రిలో భార్య.. మార్చురీలో భర్త.. కంటతడి పెట్టిస్తున్న విషాద ఘటన!