ఆంధ్రప్రదేశ్ లో గత కొంత కాలంగా యన్టీఆర్ వర్శిటీపై రగడ కొనసాగుతుంది. ఈ విషయంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్దం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు తెరపైకి మరోసారి అమరావతి రాజధాని అంశం పై పెద్ద ఎత్తున మాటల యుద్దం కొనసాగుతుంది. ఈ విషయంలో జూనియర్ యన్టీఆర్ ఎందుకు స్పందించడం లేదని విమర్శలు వస్తున్నాయి. తాజాగా దీనిపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీడియాతో మాట్లాడారు.
జూనియర్ యన్టీఆర్ కి ఎంతో కష్టపడి తన టాలెంట్ తో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు.. ఎవరూ ఆయనకు పెద్దగా సహాయం చేయలేదు అన్నారు. తెలుగు దేశం పార్టీకోసం 2009 లో ప్రచారం చేశాడు. ప్రస్తుతం తన సినిమాలు తాను చేసుకుంటూ కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో ఏపీలో జరుగుతున్న పరిణాలపై ఎందుకు ప్రశ్నించడం లేదని అనడం ఎంత వరకు న్యాయం అన్నారు. అసలు నాకు అర్థం కాదు.. అమరావతికి జూనియర్ యన్టీఆర్ కి ఏం సంబంధం అని వల్లభనేని వంశీ నిలదీశారు. టీడీపీకి కష్టం వచ్చిన ప్రతిసారి తెరపైకి యన్టీఆర్ ని తీసుకు రావడం వీళ్లకు బాగా అలవాటైందని అన్నారు.
టీడీపీ నేతలకు ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నా అంటూ ముందుకు వచ్చి స్పందించేందుకు పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా అంటూ ఎద్దేవా చేశారు. సీనియర్ యన్టీఆర్ అంటే తనకు ఎంతో గానే ఇష్టం.. అభిమానం అన్నారు.హైదరాబాద్ లో విమానాశ్రయానికి యన్టీఆర్ పేరు పెట్టాలని భావించారు.. కానీ ఏం జరిగింది రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. ఏపీలో టీడీపీ పరిపాలనలో ఉన్న సమయంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ కి యన్టీఆర్ పేరు పెట్టమని చెప్పాం.. కానీ ఏమీ జరగలేదు.
యన్టీఆర్ వర్శిటీకి పేరు మార్చినంత మాత్రాన ఆయనకు వచ్చిన నష్టం లేదు.. వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడం వల్ల ఆయనకు కొత్తగా వచ్చేది ఏదీ లేదని అన్నారు వంశీ. ఆయన 14 ఏళ్లుగా సీఎం గా ఉన్నారు.. ఒక్క జిల్లాకైనా యన్టీఆర్ పేరు పెట్టగలిగారా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ పరిపాలనలోకి వచ్చిన తర్వాత జిల్లాకు యన్టీఆర్ పేరు పెట్టారు.. అప్పుడు ఎవరూ మాట్లాడకుండా ఊరుకున్నారు.. మంచి చేసినపుడు అన్నీ స్వాగతించాలి అన్నారు.