నగరి ఎమ్మెల్యే రోజా మరోసారి తనదైనశైలిలో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. అటువైపు సీరియస్ కామెంట్లు చేస్తూనే మరోవైపు సభలో నవ్వులు పూయించారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న రాజకీయ రగడపై రోజా సెటైర్లు వేశారు. ‘ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు పెడితే 160 సీట్లు గెలుస్తామంటున్నారు. ఇంకొందరు వ్యతిరేక ఓటు చీలనివ్వం అంటున్నారు. పొత్తులు లేకుండా పోటీచేయడానికి ధైర్యం లేని జొన్నపొత్తులందరూ మాట్లాడుతుంటే నవ్వుతున్నారు. మూతిమీద మీసం ఉన్న నాయకులు నడిపే ఏ పార్టీ అయినా సింగిల్ గా పోటీ చేయగలదా? ఇటువైపు జగనన్న సింహంలా సింగిల్ గా వస్తాడు’ అంటూ రోజా ఎద్దేవా చేశారు. రోజా వ్యాఖ్యలపై మీఅభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
పొత్తులు లేకుండా పోటీ చేయడానికి ధైర్యం లేని ఈ మొక్కజొన్న పొత్తులు కూడా @ysjagan అన్నను విమర్శిస్తున్నారు. pic.twitter.com/mCsF77Pada
— Roja Selvamani (@RojaSelvamaniRK) March 25, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.