ఎప్పుడూ ప్రతిపక్షాల విమర్శలపై స్పందించే వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని ఓ వృద్ధురాలి పట్ల మానవత్వాన్ని చాటుకున్నారు. మండుటెండలో కాళ్లకు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్తోన్న వృద్ధురాలి పట్ల పెద్ద మనసు ప్రదర్శించారు.
దేశంలో భానుడి భగభగలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 7 దాటిదంటే బయట కాలు పెట్టలేని పరిస్థితి. అదే మధ్యాహ్నం సమయమైతే ఎండ వేడితో పాటు విపరీతమైన వేడిగాలులు ఉంటున్నాయి. అంతటి ఎర్రటి ఎండలోనూ ఓ వృద్ధురాలు కాళ్లకు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్తోంది. ఆ దృశ్యాలను చూసిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని చలించిపోయారు. వెంటనే ఆమెను తన కారులో ఎక్కించుకొని నగరంలోని ప్రముఖ చెప్పుల షోరూమ్‌కు తీసుకెళ్లి చెప్పులు కొనిచ్చారు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో పేర్ని నాని తన నియోజకవర్గం మచిలీపట్నంలో పర్యటిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఓ వృద్ధురాలు ఎర్రటి ఎండలో నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో పేర్ని నాని కారులో అటుగా వెళ్తున్నారు. ఎండదెబ్బకు జన సంచారం ఎక్కువగా లేని ఆ సమయంలో, వృద్ధురాలు కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడస్తుండడం ఆయన కంట పడింది. మండుటెండలో కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తున్న ఆమెను చూసి ఆయన చలించిపోయారు. వెంటనే కారు ఆపి, ఆమెను పలకరించి వివరాలు కనుక్కున్నారు. అనంతరం ఆమెను తన కారులో ఎక్కించుకొని నగరంలోని ప్రముఖ చెప్పుల షోరూమ్‌కు తీసుకెళ్లి చెప్పులు కొనిచ్చారు.
చెప్పులు ఎలా ఉన్నాయమ్మా..? బాగున్నాయా..? సరిపోయాయా..? అంటూ ఆమెను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెప్పులు కొనిచ్చిన పేర్ని నానికి ఆ వృద్ధురాలు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంది. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ఎప్పుడూ ప్రతిపక్షాల విమర్శలను తిప్పిగొడుతూ వార్తల్లో నిలిచే ఆయన, ఈ ఒక్క ఘటనతో ప్రజలను తనవైపు ఆకర్షించారు. ఆయన చేసిన మంచి పని పట్ల ఆయన అభిమానులే కాదు, ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
మండుటెండలో చెప్పులు లేకుండా వెళ్తున్న వృద్ధురాలిని
చూసి చెప్పులు కొనిచ్చిన మాజీ మంత్రి పేర్ని నాని..FULL VIDEO>>>https://t.co/ZsmLB21tnY#AndhraPradesh #MLAPerniNani @perni_nani #YSRCP #NTVNews #NTVTelugu pic.twitter.com/nHhfSWevXm
— NTV Telugu (@NtvTeluguLive) May 16, 2023