ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నో కఠిన చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం శూన్యం. డ్రైవర్ల నిర్లక్ష్యంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని రోడ్డు ప్రమాదం అందరి హృదయాలను కలచి వేస్తుంది. సంతోషంగా నిశ్చితార్థానికి వెళ్లిన వారంతా తిరిగిరాని లోకాలకు వెళ్లారు. బస్సు లోయలో పడిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రుయా, స్విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తిరుపతి రుయా సిమ్స్ బర్డ్ ఆస్పత్రిలో యాక్సిడెంట్ కి గురైన బాధితులను పరామర్శించేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి అక్కడికి వచ్చారు. ఆ సమయంలో ఆయన లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. ఎమ్మెల్యేతోపాటుగా ఆయన బాడీ గార్డులు, అనుచరులు లిఫ్ట్ ఎక్కడంతో అది కాస్త ఓవర్ లోడ్ అయ్యింది. దీంతో లిప్ట్ లాక్ పడిపోవడంతో అందరూ ఖంగారు పడ్డారు. హాస్పిటల్ లిఫ్ల్ నిర్వాహకులు రావడం ఆలస్యం కావడంతో ఆయన అనుచరులు లిఫ్ట్ డోర్ ని తొలగించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గాయపడ్డవారిని పరామర్శించి ప్రభుత్వం తరఫున పరిహారాన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డి అందజేశారు.