Burela Thulabharam: దేవుడ్ని ఏదైనా కోరిక కోరుకుని, అది జరిగితే అందకు ప్రతిఫలంగా ఏదైనా మొక్కుకోవటం మామూలుగా జరిగేదే. ఒక్కో చోట ఒక్కో విధమైన మొక్కులు ఉంటాయి. తూర్పుగోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో దేవతకు బూరెలు మొక్కుగా చెల్లించటం ఆనవాయితీ. తమ నాయకుడు ఎమ్మెల్యేగా గెలిస్తే బూరెలతో తులాబారం చెల్లిస్తానని ఓ కార్యకర్త మొక్కుకున్నాడు. అనుకున్నది జరగటంతో ఎమ్మెల్యేను తీసుకువచ్చి త్రాసులో కూర్చోబెట్టి మొక్కు చెల్లించుకున్నాడు.
వివరాల్లోకి వెళితే… తూర్పుగోదావరి జిల్లా, ఆలమూరు మండలం బడుగు వానిలంకకు చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త ఎరుబండి రమేష్ తమ నాయుకుడు చిర్ల జగ్గిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిస్తే బూరెల తులాబారం చెల్లిస్తానని మొక్కుకున్నాడు. 2019 ఎన్నికల్లో జగ్గిరెడ్డి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో కార్యకర్త కోరిక ప్రకారం శుక్రవారం జగ్గిరెడ్డి బడుగువానిలంకకు వచ్చారు. అమ్మవారి బూర్ల తులాబారంతో మొక్కు చెల్లించుకున్నారు. 125 కేజీలతో 9 వేల బూర్లను అమ్మవారికి సమర్పించారు. ఎమ్మెల్యే బూర్ల తులాబారాన్ని చూడటానికి జనం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి బూరెల మొక్కుపై మీ అభిప్రయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ప్రైవేటు బస్సులో భారీగా నగదు పట్టివేత..ఈ కోట్లు ఎవరివి?
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.