ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ముస్లిం రంజాన్ మాసాన్ని ఎంతో పవిత్రంగా పరిగణిస్తారు. ఈ మాసంలో నెలవంక దర్శనం అయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఉపవాస దీక్ష చేపడతారు. దేశ వ్యాప్తంగా పలువురు సెలబ్రెటీలు, పొలిటీషియన్స్, వ్యాపారవేత్తలు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తు సోదరభావాన్ని చాటిచెబుతుంటారు.
ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సోదరులకు ఎంతో రంజాన్ మాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు. రంజాన్ మాసంలో ప్రతి ఒక్క ముస్లిం ఉపవాస దీక్ష కొనసాగిస్తుంటారు. ఇది ఇస్లాం మతం ఆచారం ప్రకారం.. ఉపవాసాన్ని విరమించడానికి, ఉపవాసం ప్రారంభించడానికి ముందుగా నెహ్రీ, ఇఫ్తార్ నిర్వహిస్తుంటారు. భారత దేశంలో హిందులు సైతం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తుంటారు. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. వివరాల్లోకి వెళితే.
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. హిందూపురంలోని అలీహిలాలా పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముస్లింలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బాలకృష్ణ వారితో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఇఫ్తార్ విందు లో ముస్లిం సోదరులకు ఆయనే స్వయంగా వడ్డించారు. వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంటగా బాలయ్య ముస్లిం వేషధారణలో ప్రత్యేకంగా కనిపించారు. పలువురు ముస్లిం సోదరులను సన్మానించిన ఆయన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ముస్లింలకు ఈ మాసం ఎంతో పవిత్రమైనదని.. ప్రతి ఒక్కరూ ఎంతో నియనిష్టతో ఉపవాసం ఉంటారని.. వారి ఉపవాస దీక్షలు ఫలవంతం కావాలని మనసారా అల్లాను కోరుకుంటున్నా అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రంజాన్ మాసం హిందూ-ముస్లిం ఐక్యతను చాటి చెబుతుందని అన్నారు. సాధారణంగా రంజాన్ మాసంలో సెలబ్రెటీలు, పొలిటీషన్స్ గ్రాండ్ గా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తుంటారు.