ప్రజల అభివృద్ధి కోసం సరికొత్త సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నారు ఏపీ సీఎం జగన్. ఇక తాజాగా ఆయన మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా ప్రతి నెల లబ్ధిదారుల ఖాతాలో 4 వేలు జమ చేయనున్నారు. మరి ఇంతకు ఆ పథకం ఏంటి.. ఎవరు అర్హులు తెలియాలంటే..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2019 ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారంలోకి వచ్చాక.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలన్నింటిని నెరవేరుస్తూ.. ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతున్నారు. సమజంలోని అణగారిన, బడుగు బలహీన వర్గాల వారిని ఆదుకోవడమే కాక.. వారు ఆర్థికంగా ఎదగడం కోసం సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి.. లబ్ధిదారులకు నేరుగా నగదు సాయం అందిస్తున్నారు. ఇక చిన్నారులు మొదలు.. వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు ఏదో విధంగా ప్రభుత్వ సాయం పొందే విధంగా పథకాలు రూపొందించారు సీఎం జగన్. బడికెళ్లే విద్యార్థులకు అమ్మ ఒడి పేరిట ఆర్థిక సాయం, వెనకబడిన వర్గాల మహిళలకు ఏటా 15 వేల రూపాయల ఆర్థిక సాయం, వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్, చిరు వ్యాపారులు, ఆటోవాలాలకు సైతం ఆర్థిక సాయం అందజేస్తూ.. వారి సంక్షేమం కోసం పాటు పడుతున్నారు.
ఇక తాజాగా మరో సరికొత్త సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టారు. అనాథలను ఆదుకోవడం కోసం ఏపీ ప్రభుత్వం మిషన్ వాత్సల్య పేరుతో సరికొత్త సంక్షేమ పథకాన్ని తీసుకురానుంది. వారికి ప్రతి నెల 4 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేయనుంది. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్ కేసరి అప్పారావు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘అనాథ చిన్నారుల బాగోగులు చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రభుత్వం మీద మరి కాస్త ఎక్కువ బాధ్యత ఉంటుంది. తల్లిదండ్రులను కోల్పోవడం, అమ్మానాన్న నిరాదరణకు గురి కావడం.. ఇలా కారణాలు ఏవైనా సరే.. అనాథలుగా మారి నిరాశ్రయులగా ఉన్న వారిని ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి’’ అని తెలిపారు.
‘‘ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తం పథకమైన మిషన్ వాత్సల్య కింద అనాథ బాలబాలికలకు నెలకు రూ.4 వేల ఆర్ధిక సాయాన్ని అందిచేందుకు నిర్ణయించాం. 18 ఏళ్ల లోపు అనాథ బాలబాలికలు ఈ పథకానికి అర్హులు. వీరు ఏప్రిల్ 15 లోపు మిషన్ వాత్సల్య పథకం కింద దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత ఉపాధ్యాయులు, గ్రామ, వార్డు సచివాలయం అధికారులు, అంగన్వాడీ సిబ్బంది, వలంటీర్ల భాగస్వాములు దీనిలో భాగం అయ్యి.. అనాథ బాలలను గుర్తించాలి’’ అని తెలిపారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ నూతన పథకంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ పథకం అనాథలకు ఎంతో మేలు చేస్తుందని.. ఆర్థికంగా వారిని ఆదుకుంటుందని తెలిపారు. మరి ఈ కొత్త పథకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.