భారత దేశంలో ప్రదాన ఆలయాల్లో దేవతామూర్తుల మూలవిరాట్టుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీయడం నిషేదం అని బోర్డుపై రాసి ఉంచుతారు. కానీ కొంతమంది ఆ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. దీంతో ఆలయంలో అపచారం చోటు చేసుకుందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు.
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రతి చిన్న విషయం ఇట్టే వైరల్ అవుతుంది. మన జీవితంలో కనీ వినీ ఎరుగని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా పుణ్యమా అని చూడగలుగుతున్నాం. సాధారణంగా దేవతామూర్తుల మూలవిరాట్టుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీయరాదని ప్రతి దేవాలయంలో బోర్డుపై రాసి ఉంటుంది. కానీ కొంతమంది అత్యుత్సాహంతో సీక్రెట్ గా దేవతామూర్తుల మూలవిరాట్టు ఫోటోలు.. వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా విశాఖ సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో అపచారం జరిగింది. వివరాల్లోకి వెళితే..
దేశంలో ఎక్కడైనా సరే దేవతామూర్తుల మూలవిరాట్టును ఫోటో, వీడియో తీయరాదని ఆదేశాలు ఉంటాయి.. కానీ కొంతమంది అత్యుత్సాహంతో నిబంధనలు ఉల్లంఘిస్తూ అపచారానికి పాల్పపడుతుంటారు. తాజాగా విశాఖ జిల్లాలోని సింహాచలం అప్పన్న ఆలయంలో స్వామి వారి నిజ రూపదర్శనాన్ని కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం తీవ్ర కలకలం రేపింది. భక్తులు స్వామివారి నిజరూప దర్శనం కోసం ఏడాది పొడవునా ఎంతగానో ఎదురు చూస్తారు. అక్షయ తృతీయనాడు ఒక్కరోజు మాత్రమే అభించే అప్పన్న స్వామి నిజరూప దర్శనానికి భక్తులు పోటెత్తుతారు. అంత పవిత్రమైన స్వామివారి నిజరూప దర్శనం బయటకు రావడంపై ఆలయ సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతరాలయ దర్శనం వల్ల ఈ ఘటన జరిగి ఉంటుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గత ఏడాది సైతం ఇలాంటి అపచారమే జరిగింది.. కానీ అప్పటి ఆలయ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే కొంతమంది స్వామివారి గర్భాలయంలోకి వెల్లి ఫోటోలు, వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని.. ఇది ఎంతో అపచారం అని అంటున్నారు భక్తులు. తాజాగా మరోసారి స్వామి వారి ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. చందనోత్సం రోజున స్వామి వారి నిజరూపదర్ననాన్ని ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే.. ఇలాంటి ఘటనల వల్ల ఆలయంలోని భద్రతాలోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వెంటనే విచారణ జరిపించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.