Minister Perni Nani: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ అతి త్వరలో జరగబోతోందని తెలుస్తోంది. ఈ నెల 11 లేదా అంతలోపే కొత్త మంత్రులు బాధత్యలు చేపట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్నినాని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ ఈ నెల 11నుంచి కొత్త మంత్రులు వస్తారు. రవాణా శాఖ మంత్రిగా ఎవరు వచ్చినా నా అభిప్రాయాలు పంచుకుంటా. నాకు మంత్రి పదవి వచ్చినపుడు రవాణాశాఖలో ముఖ్య కార్యదర్శిగా కృష్ణబాబు, కమిషనర్‌గా సీతారామాంజనేయులు,ఆర్టీసీ ఎండీగా సురేంద్ర బాబు ఉన్నారు.
దీంతో నేను ముఖ్యమంత్రి జగన్, దేవుడ్ని తిట్టుకున్నా. నాకు రాకరాక మంత్రి పదవి వస్తే ఇదేంటని అనుకున్నా. ఈ ముగ్గురు అధికారులు ఎవరి మాటా వినరని, వీళ్లు రాజకీయ నేతలను, మంత్రులు, ఎమ్మెల్యేలను లెక్కచేయరని భావించా. కానీ, వారు ఎప్పుడూ అలా ఉండలేదు. ఏది చెప్పినా ఎంతో పాజిటివ్‌గా స్పందించారు. నేను లారీలు, బస్సు యజమానుల సంఘాలతో కలిసి పని చేశా. వారి సమస్యలను కొత్త రవాణా శాఖ మంత్రికి వివరిస్తా.అవసరం అనుకుంటే ముఖ్యమంత్రికి వివరించి పరిష్కరించేందుకు నా వంతు కృషి చేస్తా. ఏపీ బస్సులపై తెలంగాణలో కేసులు రాస్తే. మేము తెలంగాణ బస్సులపై ఏపీలో కేసులు రాస్తాం. లారీల అంతర్ రాష్ట్ర ఒప్పందం కోసం తెలంగాణ అధికారులతో ప్రయత్నం చేశా. తెలంగాణకు లాభం.. ఏపీకి నష్టమైనా సిద్దమే. హైదరాబాద్ వస్తామంటే టైమ్ ఇవ్వటం లేదు’’ అని అన్నారు. పేర్ని నాని వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : రాయలసీమకు సముద్రం.. MLA రోజా ట్వీట్ వైరల్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.