విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయనున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎందరో కేంద్రానికి లేఖలు సైతం రాశారు. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయనున్న సంగతి తెలిసిందే. వందశాతం పెట్టుబడులను వెనక్కి తీసుకొనున్నట్లు గతంలోనే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలానే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటికరణం చేయవద్దంటూ ఏపీలోని వివిధ పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. అలానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించింది. అలానే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కేంద్రానికి ఇప్పటికే పలుమార్లు లేఖలు రాశారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ ఆదివారం నాడు కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు.
ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రానికి లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయేద్దంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఉక్కు పరిశ్రమలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే కుట్ర జరుగుతుందని మంత్రి కేటీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు రూ. 12.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ప్రైవేటు సంస్థలకు కోట్ల రుణాలు మాఫీ చేసిన కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల ఎందుకు ఔదార్యం చూపడం లేదని ఆయన ప్రశ్నించారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి కోసం ఆర్థిక సాయం చేయాలని కేటీఆర్ కోరారు. అలానే విశాఖ ఉక్కు పరిశ్రమలోని స్టీల్ ఉత్పత్తులను కేంద్రం కొనాలని ఆయన ఆ లేఖలో డిమాండ్ చేశారు. సెయిల్ తో విశాఖ విలీనాన్ని పరిశీలించాలని కేటీఆర్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కి రూ. 5 వేల కోట్లు కేటాయించాలని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ విషయంలో పున:పరిశీలన లేదని కూడా కేంద్రప్రభుత్వం ఇటీవలనే స్పష్టం చేసింది. పార్లమెంట్ సమావేశాల సమయంలో ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రం రాతపూర్వకంగా సమాధానం కూడా ఇచ్చింది.
ఈ విషయమై గతంలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. అలానే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయవద్దంటూ స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు జేఏసీగా ఏర్పడి ఆందోళనలు నిర్వహించారు. ఈ పరిశ్రమ ప్రైవేటీకరణను అధికార వైసీపీ, బీజేపీతో సహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా ఈ విషయంలో పై కేంద్రానికి లేఖ రాశారు. మరి.. విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్రానికి కేటీఆర్ లేఖ రాయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.