కృష్టా జిల్లా గూడూరులో మంత్రి ఉరేగింపులో అపశృతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మంత్రిగా జోగి రమేష్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ ఊరేగింపు కార్యక్రమంలో గూడురు మండలం కొకనారాయణ పాలెం గ్రామ సర్పంచ్ బండి రమేష్ కూడా పాల్గొన్నారు. ఊరేగింపు మధ్యలో గుండెపోటు రావడంతో అక్కడిక్కడే సర్పంచ్ రమేశ్ కుప్పకూలిపోయారు. రమేష్ కు చికిత్స అందించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రాణాలు కాపాడలేక పోయారు. రమేష్ మృతితో కొకనారాయణ పాలెం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. బుధవారం జరిగిన సర్పంచ్ రమేష్ అంతిమ యాత్రలో మంత్రులు జోగి రమేష్, పేర్ని నాని పాల్గొని.. పాడె మోశారు.
అప్పటి వరకు తనతోనే ఉన్న సర్పంచ్ మరణించాడని తెలుసుకున్న మంత్రి జోగి రమేష్ దిగ్భ్రాంతికి గురయ్యారు. రమేష్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందని, ఆయన కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు. సర్పంచ్ రమేష్ అంతిమ యాత్రలో పాల్గొన్న మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి పేర్ని నాని.. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. సర్పంచ్ రమేష్ అంతిమ యాత్రలో మంత్రి జోగి రమేష్, పేర్ని నాని పాల్గొన్ని.. పాడె మోశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మీ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.