ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ రగడ చిలికి చిలికి గాలివానగా మారుతుంది. ఇదే సమయంలో ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో కొత్త జీవోల ప్రకారమే జీతాలు వస్తాయని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనని, ఉద్యోగులకు సీఎం జగన్ అన్యాయం చేయబోరని ఉద్ఘాటించారు. ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పీఆర్సీ జీవోలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయా అంశాలపై చర్చించేందుకు మంత్రుల కమిటీ సీఎంతో సమావేశమైంది.
ఇది చదవండి : నమ్మి ఇల్లు అద్దెకిచ్చినందుకు.. నట్టెటా ముంచాడు
మంత్రులు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థికశాఖ అధికారులు జగన్‌తో భేటీ అయ్యారు. అనంతం బొత్స మీడియాతో మాట్లాడుతూ.. సమస్యలపై చర్చకు ఉద్యోగులను ఆహ్వానించామని, అయినప్పటికీ ఉద్యోగులు రాలేదన్నారు. మూడు రోజులు ఎదురు చూసినా ఉద్యోగులు రాలేదని, వాళ్లు రాకుండా ద్వితీయ శ్రేణి వాళ్లను పంపారని చెప్పారు. ఇకపై కొత్త జీవోల ప్రకారమే ఉద్యోగులకు జీతాలు అందుతాయని పేర్కొన్నారు. ఫిట్మెంట్ , హెచ్ఆర్ఏ, డీఏలు అన్నీ కొత్త జీవోల ప్రకారమే చెల్లిస్తామన్నారు. ఉద్యోగులందరూ ప్రభుత్వంలో భాగమేనని, ఉద్యోగుల సమస్యల కోసమే సీఎం కమిటీ వేశారని మంత్రి బొత్స తెలిపారు.
ఇది చదవండి : తెలంగాణ, ఏపి లకు అవి ఇవ్వాల్సిందే.. లేదంటే పోరాటమే : కేటీఆర్
ఉద్యోగులు ఏ కోరిక కోరినా సమంజసంగా ఉండాలన్నారు. రాష్ట్ర పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని సూచించారు. జీతాలు ప్రాసెస్ చేయని సిబ్బంది, అధికారుల పై ప్రభుత్వ పరంగా చర్యలు ఉంటాయని వెల్లడించారు. ఉద్యోగులు ముఖ్యమంత్రి పై తూలనాడి మాట్లాడితే సంఘం నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. మేము కూడా మాట్లాడితే మరింత ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉద్యోగులు సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉరుకోబోమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.