కేంద్ర బడ్జెట్ 2022 ప్రవేశ పెట్టిన తర్వాత పలువురు అసహనం వ్యక్తం చేశారు. లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై సీఎం కేసీఆర్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. బడ్జెపై స్పందించిన ఆయన.. అదే దూకుడులో రాజ్యాంగాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. అయితే రాజ్యంగం మార్చాలన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు జాతీయస్థాయిలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో కూడా విమర్శలకు, ప్రతివిమర్శలకు కారణం అవుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగుతోంది. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు దుమ్మెత్తుకుపోసుకుంటున్నాయి.
ఇక ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇరు రాష్ట్రాల మంత్రులు సైతం స్నేహపూర్వకంగానే ఉంటారు.. అప్పుడప్పుడు రాజకీయ విమర్శలు తప్పా.. పెద్దగా ఒకర్ని ఒకరు తప్పు పట్టే పరిస్థితి లేదు. తాజాగా ఏపీ మంత్రి కూడా కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు.
ఇది చదవండి : పెన్షన్ కోసం కక్కుర్తి.. ఏకంగా అదే మార్చుకున్నాడు
ఈ వ్యాఖ్యలు దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయన్నారు రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని ఏపీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రిచెప్పారు. రాజ్యాంగంలోని ఏ అంశం వాళ్లను అంతలా కలిచివేసిందో అని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని ఆదిమూలపు సురేష్ అన్నారు.