ఏదైనా కోరికలు తీరాలంటే.. మొక్కులు మొక్కుతారు. కోర్కెలు తీరాక నిలువు దోపిడి ఇస్తాం, తలనీలాలు సమర్పిస్తాం. కానీ ఓ గ్రామంలో మాత్రం చీర కట్టుకోవాలి. చీర ఎవరైనా కట్టుకుంటారు కదా అనుకుంటున్నారా? ఇక్కడ చీరలు కట్టుకునేది ఆడవాళ్లు కాదు.. మగవాళ్లు. అవును తమ కోరిన కోర్కెలు తీరాడానికి మగవాళ్లు చీరకట్టుకుని దేవుళ్లకు మొక్కు చెల్లిస్తారు.అది కూడా హోలీ పండుగ రోజునే చేస్తారు. ఇదే ఎక్కడ అనుకుంటున్నారా? ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతకుల్లూరులో దాదాపు 300 ఏళ్లుగా ఒక ఆచారం ఉంది. హోలీ సందర్బంగా దేశవ్యాప్తంగా అందరూ రంగులు చల్లుకుంటే ఈ గ్రామంలో మాత్రం మగవాళ్లంతా చీరలు కట్టుకుని గుడికి వెళ్తారు. గ్రామంలో కొలువై ఉన్న రతీమన్మథులకు పూజలు చేసేందుకు ఇలా వెళ్తారు. ఇళ్ల నుంచి ర్యాలీగా బయలుదేరి.. రతీ మన్మథులకు ప్రత్యేక పూజలు చేస్తారు. పురుషులు ఆడవాళ్ల లాగా అలంకరించుకుని కుంభోత్సవంలో పాల్గొంటారు. హోలీ పండుగ రోజు పురుషులు స్త్రీల వేషంలో మన్మథస్వామిని దర్శించుకుంటే శుభం జరుగుతుందని, కోరికలు నెరవేరతాయన్నది ఇక్కడి గ్రామస్థుల నమ్మకం.
గ్రామానికి చెందిన వాళ్లే కాకుండా చుట్టుపక్క ఊళ్ల నుంచి కూడా వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు. ఏటా వచ్చి మొక్కులు చెల్లించుకుంటామని చెప్తున్నారు భక్తులు. తాత ముత్తాతల నుంచి ఈ ఆచారం ఉందని చెప్తున్నారు. తాతలు, నాన్న, గతంలో వేషాలు వేశారని, ఇప్పుడు తాము వేస్తున్నామని భక్తులు అంటున్నారు. ఈ వింత ఆచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.