మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన మరణం కుటుంబ సభ్యులతో పాటు పార్టీకి తీరని నష్టం అని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులు అనుభవిస్తున్న బాధను తీర్చడం ఎవరి తరం కాదు. ఇలాంటి కష్టం సమయంలో కూడా గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులు సమాజం కోసం ఆలోచించారు. దుఃఖంలో కూడా దాతృత్వాన్ని ప్రదర్శించారు. వందల కోట్ల ఆస్తులను సమాజం కోసం విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఆ వివరాలు..
నెల్లూరు జిల్లా, ఉదయగిరిలో వందెకరాల్లో మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల (మెరిట్స్)ను ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం గౌతమ్ రెడ్డి అంత్యక్రియలను కూడా మెరిట్స్ లోనే నిర్వహించారు. మంత్రి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలకు సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎంతో రాజమోహన్ రెడ్డి.. మెట్ట ప్రాంత అభివృద్ధి కోసం పలు అంశాల గురించి చర్చించారు. ఈ క్రమంలో ఉదయగిరిలో వందెకరాల్లో తాను ఏర్పాటుచేసిన ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ..రూ.225 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించేందుకు తన కుటుంబం సిద్ధంగా ఉన్నట్లు రాజమోహన్‌రెడ్డి, సీఎం జగన్ కి తెలిపారు.
ఇది కూడా చదవండి: వైరల్ అవుతున్న మేకపాటి గౌతమ్ రెడ్డి జిమ్ వీడియో!
మెరిట్స్ కాలేజీని మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరుతో.. అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చాలని కోరారు. దీనిపై స్పందించిన సీఎం త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే కళాశాల… పేరు మార్చడంతోపాటు అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని రాజమోహన్ రెడ్డికి హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి : ఆ జిల్లాలో ఖాళీ అవుతున్న వైసీపీ! ఈసారి జగన్ కి కష్టమేనా!
ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలతోపాటుగతంలో తాను ప్రాతినిధ్యం వహించిన ఒంగోలు మెట్ట ప్రాంతాలకు తాగు, సాగు నీరందించే వెలుగొండ ప్రాజెక్టు, సోమశిల హై లెవెల్ కెనాల్, ఫేజ్–1, ఫేజ్–2లను పూర్తి చేసి త్వరగా డెల్టాగా మార్చాలని రాజమోహన్‌రెడ్డి కోరారు. వెలుగొండ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఏది ఏమైనా కుమారుడు చనిపోయన బాధలో ఉండి కూడి.. సమాజం కోసం ఆలోచించారంటూ ప్రశంసలు తెలుపుతున్నారు నియోజకవర్గ ప్రజలు. మేకపాటి కుటుంబం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.