ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో ఫిబ్రవరి 21న హఠాన్మరణం చెందారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. ఫిబ్రవరి 23న గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. అమెరికాలో ఉన్న గౌతమ్ రెడ్డి కుమారుడ అర్జున్ రెడ్డి ఇండియా రావాల్సి ఉండటంతో.. అంత్యక్రియలు ఆలస్యంగా నిర్వహిస్తున్నారు. ఇక బుధవారం బ్రాహ్మణపల్లిలో ప్రభుత్వ లాంఛనాలతో గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు.
మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అజాత శత్రువుగా, అందరివాడిగా, మనసున్న మంచి మనిషిగా పేరు గడించారు. గౌతమ్ రెడ్డిని మానవీయ విలువలు కలిగిన నేతగా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. మాట తీరులోనే కాకుండా ఆపద సమయంలో తనవంతు సాయం చేయడంలో గౌతమ్‌రెడ్డి ముందుండేవారు. సాయం కోసం తన వద్దకు వచ్చిన వారికి వ్యక్తిగతంగా సాయం అందించే నాయకుడిగా గౌతమ్ రెడ్డి గుర్తింపు పొందారు.
ఇది కూడా చదవండి : మేకపాటి గౌతమ్ రెడ్డి అంటే సీఎం జగన్ కి ఎందుకు అంత ఇష్టం?
ఇక ప్రస్తుతం గౌతమ్ రెడ్డి ఆస్తిపాస్తుల గురించి కొందరు విచారిస్తున్నారు. ఈ క్రమంలో 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈసీకి సమర్పించిన అఫిడవిట్ లో ఆయన పొందుపర్చిన వివరాల గురించి ఆరా తీస్తున్నారు. దీనిలో గౌతమ్ రెడ్డి, ఆయన భార్య, కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలు పొందు పరిచారు. గౌతమ్ రెడ్డి, ఆయన భార్య ఇతర కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న నగదు, వాహనాలు, ఆభరణాలు, ఇతర ఆదాయ మార్గాల ద్వారా వచ్చే మొత్తం 14,00,47,301 రూపాయలుగా ఉంది.
ఇది కూడా చదవండి : మేకపాటి గౌతమ్ రెడ్డి గురించి మీకు తెలియని విశేషాలు!
ఇక గౌతమ్ రెడ్డి, ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న భూములు, భవనాలు, నివాస స్థలాల మొత్తం విలువను 48,19,22,775 రూపాయలుగా చూపించారు. ఇక ఇవే కాక వేరు కంపెనీల్లో గౌతమ్ రెడ్డి, ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యుల పేర్ల మీద 1,37,701 రూపాయల ఆస్తులు ఉన్నట్లు అఫిటవిట్ లో పొందు పరిచారు. మొత్తంగా గౌతమ్ రెడ్డి, ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యుల పేర్ల మీద 62 కోట్ల రూపాయలకు పైగా ఆస్తిపాస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.