సినిమా టికెట్స్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం, తెలుగు చలనచిత్ర పరిశ్రమ మధ్య ఏర్పడిన వివాదం పెరుగుతూ పోతోంది. ఒకవైపు వైసీపీ నాయకులు ఇండస్ట్రీపై వరుస కామెంట్స్ చేస్తుండటం, ఇండస్ట్రీ పెద్దలు వాటిని తిప్పి కొట్టే ప్రయత్నాలు చేస్తుండటంతో అసలు సమస్య చర్చలోకి రాకుండా పక్క దారి పట్టింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫీల్డ్ లోకి ఎంటర్ అయినా.., మంత్రి పేర్నితో మీటింగ్ ముగిసిన తరువాత ఆయన కూడా చల్లబడిపోయాడు. కానీ.., సినిమా వాళ్ళు అడ్డంగా బలిసి కొట్టుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చాయి. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ స్వయంగా రంగంలోకి దిగి చిరుకి కబురు పంపినట్టు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి :
హైదరాబాద్ నడి రోడ్డుపై రెండువేల నోట్ల కట్టలు.. ఎగబడ్డ జనం
ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య ఇంత గ్యాప్ రావడం కరెక్ట్ కాదని సీఎం జగన్ భావిస్తున్నట్టు సమాచారం. మాటల కౌంటర్స్ వల్ల గ్యాప్ పెరిగిపోతుందని.. ఇది రెండువైపులా డ్యామేజ్ జరిగే అంశం అని చిరంజీవి కూడా జగన్ కి వివరించనున్నారట. ఇక తెలుగు ఇండస్ట్రీపై పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఈ సందర్భంగా సీఎం జగన్‌కు దృష్టి చిరంజీవి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కమిటీ నిర్ణయించే కొత్త టికెట్స్ ధరలు వచ్చే వరకు ఇరువైపుల నుండి ఎలాంటి కామెంట్స్ రాకుండా కంట్రోల్ చేయడానికే ఈ మీటింగ్ జరుగుతున్నట్టు సమాచారం. ఇక ఇదే సమయంలో టికెట్స్ ధరలు ఎలా ఉంటే.. ఇండస్ట్రీకి, ప్రజలకి మేలు జరగుతుందన్న విషయంలో చిరు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయబోతున్నారట. ఈ లెక్కన చూసుకుంటే చిరు రాకతో వివాదానికి తెర పడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.