ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జనరల్ చెకప్ కోసం మణిపాల్ ఆసుపత్రిలో శుక్రవారం నాడు హెల్త్ చెకప్ చేయించుకొన్నారు. 45 నిమిషాల పాటు సీఎం జగన్ హెల్త్ చెకప్ చేయించుకొన్నట్టుగా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇటీవల సీఎం జగన్ వ్యాయాయం చేస్తున్న సందర్భంలో కాలు బెణికింది. వెంటనే వైద్యులు వచ్చి చికిత్స చేశారు. విశ్రాంతి తీసుకుంటే నొప్పి తగ్గిపోతుందని వైద్యులు సలహా ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన మడమనొప్పితో బాధ పడుతున్నారు.
ఈ మద్య కాలు నొప్పి ఎక్కువ కావడం, వాపు రావడంతో డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎమ్మారై స్కానింగ్ తో పాటు, జనరల్ చెకప్ చేయించుకున్నారు. పరీక్షల రిపోర్టులను చూసిన అనంతరం విశ్రాంతి తీసుకోవాలని సీఎం జగన్ కు వైద్యులు సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఏపిలో భారీ వర్షాలు కురుస్తుండడంతో సీఎం జగన్ అలర్ట్ అయ్యారు. జిల్లాల కలెక్టరలతో సమీక్ష నిర్వహించారు. చిత్తూరు, కడప కలెక్టర్లు, ఇతర జిల్లాల అధికారులతో క్యాంపు కార్యాలయం నుంచే సమీక్ష చేశారు.
ప్రధానంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని, సహాయ శిబిరాల్లో ఉన్న వారిని మంచిగా చూసుకోవాలన్నారు. వారికి మంచి ఆహారం అందించాలని, బాధితులకు వేయి రూపాయల చొప్పున అందించాలని సూచించారు. అంతే కాదు బాధితుల కోసం ఒక ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.
ఇది కూడా చదవండి : విపత్తులో మహిళా ఎస్ఐ సేవ అందరికీ ఆదర్శం : పవన్ కళ్యాన్