ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన సినిమా టికెట్ల వివాదం రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల కిత్రం దీనిపై చర్చించడానికి చిరంజీవితో పాటు పలువురు హీరోలు, దర్శక నిర్మాతలు సీఎం జగన్ తో భేటీ అయ్యారు. తాజాగా మా అధ్యక్షుడు మంచు విష్ణు మంగళవారం తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్ ని కలిశారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. లంచ్ కోసం సీఎం జగన్ ని కలిశానని తెలిపారు. ఈ భేటీలో ఇండస్ట్రీ సమస్యల గురించి చర్చించాను. కానీ వాటి గురించి ఇప్పుడే చెప్పలేను అన్నారు.
ఇది కూడా చదవండి : సీఎం జగన్-మంచు విష్ణు భేటీలో ఊహించని ట్విస్ట్..!
ఇక సినీ ప్రముఖుల భేటీకి మంచు కుటుంబానికి ఆహ్వానం అందలేదా అన్న ప్రశ్నపై మంచు విష్ణు స్పందించారు. ‘‘మా నాన్నను కూడా ప్రభుత్వం ఆహ్వానించింది. కానీ కొందరు కావాలని ఆ ఆహ్వానాన్ని మాకు అందకుండా చేశారు. ఆహ్వానం చేరకుండా ఎవరు చేశారో మాకు తెలుసు. ఇక ఇండస్ట్రీని విశాఖకు తరలించే అంశంపై ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం’’ అని తెలిపారు. ఇక తనకు తిరుపతిలో స్టూడియో నిర్మించే ఆలోచన ఉందని.. దాని గురించి త్వరలో మరోసారి సీంఎ జగన్ తో చర్చిస్తానని తెలిపారు. విష్ణు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.