ఓ వృద్ధురాలు రెండు రోజులు డంపింగ్ యార్డులో ఉండటం స్థానికులు గుర్తించారు. ఆమె ఎవరు? ఎందుకు అక్కడ ఉంటోంది? అన్న ప్రశ్నలు వారిలో తలెత్తాయి. దీంతో వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. వీఆర్వో గోలి ఇన్నయ్య అక్కడకు వెళ్లాడు.
తల్లిని మించిన దైవం ఉన్నదా?.. అని తెలుగులో ఓ పాట ఉంది. ‘వంద దేవుళ్లే కలిసొచ్చినా.. అమ్మా నీలాగా చూడలేరమ్మా’ అని కూడా తెలుగులో ఓ పాట ఉంది. ఈ పాటలు రెండూ తల్లి దైవం కంటే ఎక్కువనే చెబుతున్నాయి. మనల్ని నవమాసాలు కడుపులో మోసి పెంచిన తల్లి నిజంగా ఓ అద్భుతం. పిల్లల బాధ గురించి అర్థం చేసుకునే గుణం తల్లికి మాత్రమే ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా.. నష్టాలు వచ్చిన బిడ్డ బాగు కోసమే తల్లి ఆలోచిస్తుంది. అలాంటి తల్లి పట్ల కొందరు పిల్లలు జాలి లేకుండా ప్రవర్తిస్తున్నారు. ముసలి వయసులో వారిని ఇంటినుంచి బయటకు వెళ్లగొడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి కూడా తన తల్లి పట్ల అమానుషంగా వ్యవహరించాడు. ఆమెను ఏకంగా డంపింగ్ యార్డులో వదిలేసి వచ్చాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల క్రితం తాడేపల్లి బ్రహ్మానందపురంలోని డంపింగ్ యార్డులో ఓ వృద్ధురాలు కనిపించింది. స్థానికులు ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు చేరవేశారు. వీఆర్వో గోలి ఇన్నయ్య డంపింగ్ యార్డు వద్దకు చేరుకున్నాడు. వృద్ధురాలిని కలిసి ఆమె గురించి విచారించాడు. ఆమె మాట్లాడుతూ.. ‘‘ నా పేరు రామలక్ష్మి. నా భర్త పేరు కృష్ణ. మాది విజయవాడలోని గవర్నర్ పేట. నా కొడుకు శ్రీనివాసే నన్ను ఆటోలో తీసుకువచ్చి ఇక్కడ వదిలిపెట్టి వెళ్లాడు’ అని చెప్పింది. దీంతో ఆమెను వృద్ధాశ్రమానికి తరలించారు. ఇక అప్పటినుంచి ఆమె అక్కడే ఉంటోంది. ఆమె కుమారుడికి సంబంధించిన విషయాలను పూర్తిగా చెప్పటానికి ఆమె ఒప్పుకోలేదు.
పూర్తిగా కోలుకున్న తర్వాత విచారిద్దామని అధికారులు భావిస్తున్నారు. ఈ సంఘటన జరిగి, ఆమె వృద్ధాశ్రమంలో చేరి ఇప్పటికి 10 రోజులు పైనే అయింది. రామలక్ష్మి డంపింగ్ యార్డులో ఉన్న దృశ్యాల తాలూకా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూస్తున్న నెటిజన్లు వృద్ధురాలి పరిస్థితికి చలించిపోతున్నారు. తల్లిని డంపింగ్ యార్డులో పడేసిన కుమారుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి, కన్న తల్లిని ఓ కుమారుడు డంపింగ్ యార్డులో వదిలేసిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
కన్న తల్లిని డంపింగ్ యార్డులో పడేసిన కుమారుడు pic.twitter.com/fnBgJcBBX4
— venky bandaru (@venkybandaru13) March 7, 2023