Mali Tribe : ఈ ప్రపంచం ఎన్నో వింతలకు, విశేషాలకు నెలవన్న సంగతి తెలిసిందే. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆచారాలు ఆచరణలో ఉంటాయి. ముఖ్యంగా గిరిజన తెగల్లోని ఆచారాలు ఎంతో వింతగా అనిపిస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లోని మాలీ తెగలోనూ ఓ వింత ఆచారం ఆచరణలో ఉంది. ఈ ఆచారం ప్రకారం వాళ్లు పొత్తిళ్లలో ఆడుకునే చిన్న ఆడపిల్లలకు పెళ్లి చేస్తారు. ఏదో గుట్టుచప్పుడు కాకుండా కాదు.. బంధువులను పిలిచి మరీ వైభవంగా చేస్తారు. పెళ్లి ఎలా జరుగుతుంది.. ఎందుకు చిన్న వయసులో పెళ్లిళ్లు చేస్తారు అన్న విషయాలు తెలుసుకోవాలంటే మొత్తం చదివేసేయండి. విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం చౌడుపల్లిలో మాలి అనే గిరజన తెగ ఉంది. ఈ తెగ ఒరిస్సానుంచి ఇక్కడకు వలస వచ్చింది.
ఎప్పుడో దశాబ్ధాల క్రితం వలస వచ్చినా.. తమ ఆచారాలను మరవకుండా పాటిస్తున్నారు. ఇందులో ఐదు, ఆరేళ్లలోపు ప్రతి ఆడపిల్లకు తల్లిదండ్రులు పెళ్లి చేయాలి. తాజాగా, 27 మంది ఆడపిల్లలకు పెళ్లిచేశారు. అయితే, ఈ పెళ్లికి అబ్బాయి అవసరం లేదు. 20 కర్రలతో పందిరి వేస్తారు. ఒక్కో కర్రకు ఏడు కుండలు కడతారు. మరికొన్నిటికి 9, మధ్యలో ఉన్న దానికి 11 కుండలు కడతారు. ఆడపిల్లలను పెళ్లి కూతురిలా ముస్తాబు చేసి పందిరి కింద కూర్చోబెడతారు. అనంతరం తలపై నీళ్లు పోస్తారు. ఇలా చేయడం ద్వారా పెళ్లి అయిపోయినట్లే. ఇక ఆడపిల్ల యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్లకు నచ్చిన వాళ్లతో వెళ్లిపోయినా తల్లిదండ్రులు పట్టించుకోరు. అలా చేయటం వల్ల దోషం కూడా ఉండదని భావిస్తారు. ఈ పెళ్లి తర్వాత పిల్ల బాధ్యత తమపై లేదని అనుకుంటారు. ఈ వింత ఆచారంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : వాట్సాప్ ఫొటో ద్వారా.. 19 ఏళ్ల తర్వాత తండ్రిని కనుక్కున్న కొడుకు..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.