కాలం మారినా మనుషుల భావాలు మారినా.. ప్రేమ పెళ్లిళ్ల విషయంలో పెద్దల పట్టింపులు మాత్రం మారడం లేదు. పిల్లల మనస్సులను అర్థం చేసుకోకుండా.. పరువు, ప్రతిష్ట అంటూ పాకులాడుతూ వారి జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్నారు. దీంతో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ప్రేమకు పెళ్లి అవాంతరంగా మారింది. మన కులం అబ్బాయి కాదని, మన స్టేటస్‌కు అబ్బాయి తగడని తల్లిదండ్రులు వారి ప్రేమను అడ్డుకుంటున్నారు. వారి మనస్సులను అర్థం చేసుకోకుండా.. పరువు, ప్రతిష్ట అంటూ పాకులాడుతూ వారి జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్నారు. లేదంటే వేరొకరితో బలవంతపు వివాహాలు చేస్తున్నారు. కాలం మారినా మనుషుల భావాలు మారినా.. ప్రేమ పెళ్లిళ్ల విషయంలో పెద్దల పట్టింపులు మాత్రం మారడం లేదు. దీంతో ఇంట్లో పెద్దలకు చెప్పకుండా ప్రేమించిన యువతీ, యువకులు ఇంట్లో నుండి పారిపోయి ఆత్మహత్యలు చేసుకోవడమే లేదంటే ప్రేమ వివాహాలు చేసుకోవడం జరుగుతున్నాయి. తాజాగా ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది కృష్ణాజిల్లాలో.
ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రేమించుకున్నారు. కులాలు, మతాలు వేరుకావడంతో పెద్దలు వీరికి పెళ్లికి అంగీకరించకపోవడంతో పారిపోయి గుడిలో పెళ్లి చేసుకున్నారు. కానీ పెద్దలు ఏమీ చేస్తారోనని భయంతో గుడిలోనే తలదాచుకున్న ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బుద్దాల వారి పాలెంకు చెందిన నాగరాజు, మచిలీపట్నానికి చెందిన గాయత్రిలు సచివాలయ ఉద్యోగులు. వీరిద్దరూ కొద్ది కాలంగా ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో తల్లిదండ్రులు అంగీకరించకపోడంతో ఊరిలోని రామాలయంలో పెళ్లి చేసుకున్నారు. అయితే కులాంతర వివాహం చేసుకోవడం వల్ల పెద్దలు ఏదైనా చేస్తారేమోనన్నభయం ఏర్పడింది.
తల్లిదండ్రులు, బంధువుల నుండి రక్షణ లేకపోవడంతో పెళ్లి చేసుకున్న ఈ జంట ఆలయంలోనే దాక్కున్నారు. గుడికి తాళం వేసుకుని తమను తాము నిర్భంధించుకున్నారు. పెద్దలు కలగజేసుకోవాలని, తమకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన స్థానికులు, గ్రామస్థులు ఇరు కుటుం సభ్యులతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని పోలీసులకు కూడా తెలియచేశారు. కుటుంబ సభ్యుల నుంచి ప్రమాదం పొంచి ఉందంటూ యువతీ, యువకుడు పోలీసు రక్షణ కోరారు. రక్షణ కల్పిస్తామని హామీ ఇవ్వటంతో ప్రేమ జంట గుడి నుండి బయటకు వచ్చారు.