Anantapur: బుధవారం రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల 4 గంటల పాటు ఆగకుండా వర్షం దంచికొట్టింది. ఈ భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లాయి. ఈ నేపథ్యంలోనే పలు చోట్ల ప్రజా రవాణాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. బ్రిడ్జిలపై నుంచి నీళ్లు పొంగిపొర్లుతున్నాయి. రోడ్డుపై అడుగు ఎత్తు వరకు నీళ్లు పొంగి పొర్లుతుండటంతో వాహనాలు కానీ, పాదచారులు కానీ అటు ఇటు తిరగలేని పరిస్థితి ఏర్పడుతోంది. తప్పని పరిస్థితుల్లో వాహనాలు బ్రిడ్జి దాటుతూ ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా, ఓ లారీ బ్రిడ్జి దాటుతూ వాగులో పడిపోయింది. అదృష్టం కొద్దీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వివరాల్లోకి వెళితే..
బుధవారం కురిసిన వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లాలోని పలు వాగులు పొంగి పొర్లాయి. బ్రిడ్జిల మీద నుంచి అడుగల మేర నీళ్లు పారుతున్నాయి. బుక్కరాయ సముద్రం దగ్గర ఉన్న ఓ బ్రిడ్జి మీద నుంచి కూడా నీళ్లు పెద్ద ఎత్తున పొంగి పొర్లుతున్నాయి. అటు వైపుగా వచ్చిన ఓ కంటైనర్ లారీ వాగుపైనుంచి రోడ్డు దాటటానికి ప్రయత్నించింది. అయితే, నీటి ఉధృతి కారణంగా అదుపు తప్పి వాగులో పడిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డ్రైవర్ తప్పిదం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Anantapur to Tadipatri near Bukkarayasamudram ☹️☹️ visuals taken now pic.twitter.com/6G5MRFLYIV
— Andhra Pradesh Weatherman (@APWeatherman96) October 13, 2022