బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంగా ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదిలో కొట్టుకపోతున్న దంపతులతో పాటు మరో వ్యక్తిని స్థానికులు కాపాడారు. ఏర్పేడు మండలం శ్రీకాళహస్తీ నుంచి పాపానాయుడు పేటకు వెళ్ళే ప్రధాన రహదారిపై ఈ సంఘటన జరిగింది. చెందూరుకు చెందిన శంకరయ్య, కోటేశ్వరమ్మ దంపతులతో పాటు బాబు అనే వ్యక్తి గోవిందవరం సమీపంలోని స్వర్ణముఖి నదిపై ఉన్న కాజ్ వే దాటుతున్నారు. ఇదే సమయంలో వరద ప్రవాహం పెరగటంతో నదిలో పడిపోయారు. అటూగా వెళ్తున్న స్థానికులు కొట్టుకపోతున్న దంపతులను గమనించి కాపాడారు.