ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృతి అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి దాసరి సామ్రాజ్య లక్ష్మీ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఆరోగ్యం క్షీణించింది. చికిత్స పొందుతూనే ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. సామ్రాజ్య లక్ష్మీ 1943లో జన్మించారు. 85 ఏళ్ల వయసులో ఆమె స్వర్గస్తులయ్యారు. సామ్రాజ్య లక్ష్మీ మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
లక్ష్మీ పార్వతి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఆమె అంత్యక్రియలు హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, లక్ష్మీ పార్వతి.. సామ్రాజ్య లక్ష్మీ దంపతులకు ఒక్కగానొక్క కూతురిగా తెలుస్తోంది. లక్ష్మీ పార్వతి 1962 ఆగస్టు 10న జన్మించారు. ఆమె ప్రస్తుతం ఏపీ తెలుగు, సంస్కృతి అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరి, లక్ష్మీ పార్వతి తల్లి సామ్రాజ్య లక్ష్మీ మరణంపై మీ సంతాపాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.