గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్లో పిడుగులు కూడా పడుతున్నాయి. భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు రావడతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్నిచోట్ల బోర్డింగులు, పెద్ద చెట్లు విరిగిపోయాయి.
ప్రకృతి ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవరూ ఊహించలేరు.. ఈ నెల మొదటి వారం ఎండలు దంచి కొట్టాయి. వారం రోజుల నుంచి అకస్మాత్తుగా వాతావరణం చల్లబడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. మరో రెండు రోజలు వరకు ఏపీలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో విజయవాడ ఇంద్రకిలాద్రిపై పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే..
గత వారం రోజుల నుంచి ఏపిలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఏపీలో సోమ, మంగళవారాల్లో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే.. సోమవారం విజయవాడలో పలు ప్రాంతాల్లో ఊదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఈ వర్షాలనికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. అయితే ఈదురు గాలులు ప్రభావంతో ఇంద్రకిలాద్రిపై భారీ ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా వచ్చిన ఈదురుగాలితో ఓం టర్నింగ్ వద్ద శివరాత్రి సందర్భంగా కర్రలతో ఏర్పాటు చేసిన లేజర్ లైటింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కర్రలు ఒక్కసారి కూలిపోవడంతో పెద్ద శబ్ధం వచ్చింది.. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. అదృష్టం కొద్ది ఆ ప్రదేశంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇంద్రకీలాద్రి పై తప్పిన పెను ప్రమాదం pic.twitter.com/gf5kt7UrUK
— Hardin (@hardintessa143) March 27, 2023