కోట్ల ఆస్తులు ఉన్నా కొంత మంది చాలా సింపుల్ గా కనిపిస్తుంటారు. ఉన్నత పదవుల్లో ఉన్నా.. సినీ రంగంలో వారైనా కొంత మంది సామాన్యుల్లా తమ ఉనికి చాటుకుంటారు. ప్రధాని హూదాలో ఉన్న మోదీ అప్పుడప్పుడు రోడ్డుపై ఉన్న కాకా హూటల్లో చాయ్ తాగుతూ కనిపిస్తుంటారు. ఆ మద్య స్టార్ హీరో అల్లు అర్జున్ రోడ్ సైడ్ ఉన్న చిన్న హూటల్లో దోష తిన్న విషయం తెలిసిందే. ఇలా సెలబ్రెటీలు బయట తింటున్న వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.
దేశ వ్యాప్తంగా ఎన్నో జ్యూవెలరీ షాపులు ఉన్నా.. వాటికి పలు రకాలుగా మోడల్స్, హీరోయన్స్ ని పెట్టి లక్షలు ఖర్చు పెట్టి మరీ యాడ్స్ ని రూపొందించి ప్రచారం చేస్తుంటాయి. బుల్లితెరపై ‘డబ్బులు ఎవరికీ ఊరికే రావు’ అంటూ డైలాగ్ తో కనిపించే లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ అందరికీ సుపరిచితుడే. కోట్ల ఆస్తి ఉన్నా ఆయన ఒక సామాన్యుడిలా రోడ్ సైడ్ టిఫిన్ బండి వద్ద దోషలు తింటున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ నెల్లూరు జిల్లాలో ఓ దోశ బండి దగ్గర దోశ తింటున్న దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేశంలో అత్యంత ధనవంతుడిగా పేరు తెచ్చుకున్నవారిలో ఈయన కూడా ఉన్నారు. దక్షిణ భారతదేశంలో లలితా జ్యూవెలరీ షోరూమ్ లు ఎన్నో ఉన్నాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వంలా కిరణ్ కుమార్ నెల్లూరులో దోశ బండి దగ్గర దోశ తింటున్న దృశ్యాలు ఆశ్చర్య పరిచాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.