ఓ వైపు తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పట్నం మహీందర్ రెడ్డి.. తాండూరు సీఐని బూతులు తిట్టిన ఆడియో రికార్డింగ్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై అటు పోలీసు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. ఇటు పట్నం మహేందర్ రెడ్డి.. ఆ ఆడియో తనది కానది అంటున్నారు. ఈ వివాదం ఇంకా కొనసాగుతుండగానే.. తాజాగా APలో ఇదే తరహా సంఘటన చోటు చేసుకుంది. చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిర్వహిస్తున్న పల్లెబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మహిళా సంఘంలోని ప్రతి సభ్యురాలు రావాలని.. లేదంటే.. ఆసరా రుణాల మంజూరుకు సంతకాలు పెట్టనని మహిళా అధికారి బెదిరింపులకు దిగారు.
ఇది కూడా చదవండి: సీఐపై అనుచిత వ్యాఖ్యలు.. ఆ ఆడియో నాది కాదు: మహేందర్‌రెడ్డి
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్ లీక్‌వ్వడంతో ఈ సంఘటన సంచలనంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే సభకు రాకపోతే.. ఆసరా రుణాలు ఇవ్వనంటూ బెదిరింపులకు దిగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నేతలు, వారి పేరు చెప్పి.. అధికారులు ఇలా బెదిరింపులకు పాల్పడ్డంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డి రియల్ టైగర్ ఆఫ్ తెలంగాణ: రాంగోపాల్ వర్మ