ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో మౌళిక వసతులు ఏర్పాటు చేస్తున్నామిన.. మంచి విద్యాబోధన కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మన బడి నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామని చెబుతున్నప్పటికీ ఇంకా పరిస్థితులు మారలేదు. ఇక ఏపిలో గవర్నమెంట్ స్కూల్స్ ని కార్పోరేట్ లేవెల్లో మార్చుతున్నామని ప్రభుత్వం అంటున్నా.. కొన్ని చోట్ల శిథిలావస్థకు చేరిన స్కూళ్లు పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి.
కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామంలో ఒక పాత స్కూల్ లో స్లాబు పెచ్చులు ఊడి ఇద్దరు విద్యార్థులపై పడటంతో వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. అందులో ఒక విద్యార్థి తలపై పెద్ద పెచ్చు పడటంతో తలపై తీవ్ర గాయం అయ్యింది. వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో రావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ పాఠశాల దుస్థితిపై ప్రభుత్వ అధికారులకు ఎప్పటి నుంచో చెబుతున్నామిన.. ఎన్ని విన్నపాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాడు నేడు పథకం కింద రాజకీయ నేతలు కాంట్రాక్టర్లే బాగుపడుతున్నారని జనం మండిపడుతున్నారు.
చిన్నారులకు గాయాలు బాధాకరం : చంద్రబాబు
కర్నూలు జిల్లా గోనెగండ్ల పాఠశాల విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో దీనిపై మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ఘాటుగా స్పందించారు. నాడు-నేడు అని ప్రచారం చేసుకోవడం ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. దీనితో కొంత మంది కాంట్రాక్టర్లు డబ్బులు తమ జేబులో వేసుకుంటున్నారే తప్ప నాణ్యమైన పనులు చేయడం లేదని విమర్శించారు. పాఠశాల లో పెచ్చులు ఊడి పిల్లలపై పడటం ఎంతో బాధ కలిగిందని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే బడికి వచ్చిన చిన్నారులు రక్తం చిందించాల్సి వచ్చిందని చంద్రబాబు అన్నారు. ఇకనైనా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం శ్రద్ధ చూపాలని ట్వీట్ చేశారు.
కర్నూల్ జిల్లా గోనెగండ్ల మండల ప్రాధమికోన్నత పాఠశాలలో పైకప్పు పెచ్చులు రాలి చిన్నారుల తలలకు తీవ్ర గాయాలైన ఘటన బాధాకరం. నాడు-నేడు అంటూ ప్రచారం చేసుకోవడం తప్ప ఈ ప్రభుత్వం పాఠశాలల పునరుద్ధరణ కోసం ఏమీ చేయడం లేదనడానికి ఈ ఘటనే ఉదాహరణ.(1/3) pic.twitter.com/U1Nb7zoXcY
— N Chandrababu Naidu (@ncbn) April 28, 2022