కృష్ణా నది నీళ్ళ రంగు మారడంపై విజయవాడ వాసుల్లో ఆందోళన నెలకొంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణా నది నీళ్లు పచ్చ రంగులోకి మారిపోయాయి. అంతేకాదు నీళ్లపై రసాయనాలతో కూడిన ఒక పొర ఏర్పడింది. దీంతో రసాయనాల వల్ల రంగు మారిందేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటినే అందరూ ఉపయోగించుకుంటారు. దీంతో కలుషితమైన ఈ నీటిని ఎలా ఉపయోగించుకోవాలని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ కృష్ణా నది నీరు ఏలూరు కాలువలో కలుస్తుంది. దీంతో కృష్ణా జలాశయాలు కలుషితమైపోయాయని స్థానికులు భయపడుతున్నారు. గతంలో కూడా నీళ్ల రంగు మారిందని, ఆరు నెలలకొకసారి కృష్ణా నది నీరు రంగు మారుతుందని.. అయితే ఇంతలా మారడం ఇదే మొదటిసారి అని ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా నదిలో నీళ్లు ఆకుపచ్చగా మారడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఫ్యాక్టరీల నుంచి వచ్చిన వ్యర్థాలు కృష్ణా నీటిలో కలవడం వల్ల పచ్చ రంగు ఏర్పడిందా? లేక నీళ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండటం వల్ల నీళ్లు ఈ రంగులోకి మారాయా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రూరర్ ఏరియా జనాలు బ్యారేజ్ దగ్గర పచ్చ రంగులో ఉన్న ఈ నీళ్లను చూసి భయపడుతున్నారు. ఫ్యాక్టరీల నుంచి వచ్చే రసాయన వ్యర్థాల వల్లే నీళ్ల రంగు ఇలా మారిందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రసాయనాలతో కలుషితం అవుతున్న కృష్ణ నీటిని ఎలా ఉపయోగించుకోవాలని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నీళ్లు ఎక్కువ నిల్వ ఉన్న చోట నాచు పట్టి పచ్చ రంగులో మారుతుంది. వర్షాకాలంలో బురద రంగులోకి మారడం సహజం. నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి నాచు పట్టే అవకాశం లేదని అంటున్నారు. రసాయనాల వల్లే ఇలా రంగు మారిందా? కృష్ణా నది నీళ్ల రంగు మారడానికి మీకు తెలిసిన కారణాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.