బోరుగడ్డ అనిల్ కుమార్.. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న పేరిది. హద్దు, అదుపులేని బూతులతో పక్క పార్టీల నాయకులపై తీవ్ర స్థాయిలో రెచ్చిపోతూ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్‌గా మారుతున్నారు. తాను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానినని చెప్పుకుంటూ ఇతర పార్టీల నాయకులపై బూతులు మాట్లాడటం రాజకీయాల్లోనే కాదు.. సామాన్య జనంలోనూ చర్చనీయాంశంగా మారుతోంది. ఈ క్రమంలోనే తన ఇంటిని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులే తగలబెట్టారంటూ బోరుగడ్డ అనిల్ ఆరోపించారు. అతడు చేసిన ఆరోపణలపై వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. అనిల్ ఆఫీస్ ను తానే తగులబెట్టించానని ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బోరుగడ్డ అనిల్ పై పలు వ్యాఖ్యలు చేశారు.
గుంటూరు జిల్లాలో వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ కార్యాలయానికి గుర్తు తెలియని వక్తులు నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. గుంటూరు డొంక రోడ్డులో ఉన్న అనిల్ ఆఫీస్ కు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఇటీవల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై బోరుగడ్డ అనిల్ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కోటంరెడ్డికి అనిల్ ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం సోషల్ మీడియాలో చర్చగా మారింది. అనంతరమే అనిల్ ఆఫీస్ కి కొంతమంది నిప్పు పెట్టటం జరిగింది. అయితే ఈ ఘటనపై అనిల్ మాట్లాడుతూ.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపించాడు. ఈ వ్యాఖ్యలపై కోటంరెడ్డి కూడా ఘాటుగానే స్పందించాడు.
బుధవారం మీడియాతో మాట్లాడిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..”నాకు అంతశక్తి లేదు. కానీ అనిల్ నాకు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు. నెల్లూరులో ఉండే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గుంటూరుకు వచ్చి ఆఫీస్ తగల బెట్టించాడు అంటే ఫ్రీ పబ్లిసిటీనే కదా. ఎవరో బాబిరెడ్డి అనే వ్యక్తి నా అనుచరుడని, ఆయనే అనిల్ ఆఫీస్ కు నిప్పు పెట్టించారని అంటున్నారు. ఆ పేరుతో నాకు కార్యకర్త ఎవరూ లేరు. ఒకవేళ అలా నా మనుషులు ఎవరు చేసినా కూడా నేను సమర్ధించను. అలాంటి పనులకు, అనిల్ మాట్లాడే లాంటి భాషకు నేను వ్యతిరేకం. సమాజంలో అందరు నాలాగా పెద్దరికంగా ఉండరు కదా?. నా మీద కేసులు పెట్టాలా, నా వెంట నడిచి వారిపై కేసులు పెట్టాల అనేదే వారి ఉద్దేశ్యం.
అయితే అన్నిటికి తెగించి ఉండేవాళ్లే నాతో ఉన్నారు. నాకు ఈ కేసులు కొత్తేమి కాదు. నేను 8వ తరగతి చదివే సమయంలోనే ఓ కేరళ విద్యార్థి మరణం విషయంలో ధర్నా చేసి జైలుకు వెళ్లాను. అలానే వంగవీటి రంగ హత్యకు నిరసన తెలిపిన సమయంలో జైల్లో వేసి మమల్ని ఓ రేంజ్ లో వాయించారు. అరికాలిపై కొడితే ఆ దెబ్బ తలకెక్కేది. అలాంటి నాపై మీరు ఎన్ని కేసులు పెట్టినా.. అన్నిటిని ఎదుర్కొన్నేందుకు సిద్ధంగా ఉన్నాను. మాపై అక్రమంగా కేసులు పెట్టాలనుకుంటే మేము కూడా ప్రజాస్వామ్య మార్గంలో వాటిని ధైర్యంగా ఎదుర్కొంటాము. అలానే నా ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరిపించాలని కేంద్ర హోం శాఖకు లిఖిత పూర్వంగా ఫిర్యాదు చేస్తున్నాను” అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. మరి.. కోటంరెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.