కొన్నినెలల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పాత 13 జిల్లాతో పాటు కొత్తగా మరో 13 కలిపి.. మొత్తం 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. అయితే వాటిలో కొన్నిటికి పాత పేర్లు ఉండాగా.. మరికొన్నిటికి వివిధ పేర్లు పెట్టారు. అలా అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లాను కూడా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాజాగా కోనసీమ జిల్లా పేరు మారనుంది. ఆ జిల్లా పేరు డా.బి. ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. దీనిపై త్వరలో ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల కానుంది. అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలని దళిత, ప్రజాసంఘాలు, వివిధ పార్టీలు ప్రభుత్వాన్ని కోరాయి.
దీనికోసం పలుచోట్ల నిరసన కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లా పేరులో డా.బి. ఆర్. అంబేడ్కర్ పేరును చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లా విషయానికి వస్తే ఇందులో.. రామచంద్రాపురం, మండపేట, అమలాపురం, రాజోలు, గన్నవరం, కొత్తపేట, ముమ్మిడివరం అసెంబ్లీ నియోజవర్గాలు ఉన్నాయి. జిల్లాలో రామచంద్రాపురం, అమలాపురం రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. రామచంద్రాపురం, కె.గంగవరం, మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం, కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు మండలాలతో కోనసీమ జిల్లా ఏర్పాటు చేశారు.మరి.. ఏపీ ప్రభుత్వం కోనసీమ జిల్లాపై తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి:మరో KGFలా నెల్లూరులోని ఉదయగిరి! 2000 హెక్టార్లలో బంగారు నిక్షేపాలు!