కేఏ పాల్ ఈ పేరు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఓ వైపు శాంతి దూతగా ఉంటూనే ప్రజాశాంతి పార్టీ ఏర్పాటు చేసి.. పొలిటికల్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటి ఆయన పేరు మారుమోగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఏం మాట్లాడినా అందరూ ఆసక్తిగా చూస్తారు. తాజాగా కాకినాడలో కేఏ పాల్ కి చేదు అనుభవం ఎదురైంది. కేఏ పాల్ తనకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని.. గత కొంత కాలంగా ఆ డబ్బు ఇవ్వకుండా తనను వేధిస్తున్నాడని.. తన డబ్బు అడిగితే బెదిరించాడని రత్నకుమార్ అనే వ్యక్తి తెలిపారు.
కేఏ పాల్ కాకినాడ పర్యటనలో ఉన్నారు.. ఈ క్రమంలో రత్నకుమార్ అనే వ్యక్తి కేఏ పాల్ కాన్వాయ్ కి అడ్డుపడి ఆయనను నిర్భందించాడు. కేఏ పాల్ కి సంబంధించిన రెండు కాన్వాయ్ లను రత్నకుమార్ అనుచరులు స్వాధీనం చేసుకొని సీబీసీ ఎన్సీ కాంపౌండ్ లో ఉంచారు. వాటిని విడిపించేందుకు కేఏ పాల్ అనుచరులు సంప్రదింపులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. మరోవైపు రత్నకుమార్ మాట్లాడుతూ.. ఈ విషయంలో ఎవరి జోక్యం అవసరం లేదని తమ సమస్యను చర్చించుకొని తామే పరిష్కరించుకుంటామని అన్నారు. మరోవైపు కేఏ పాల్ ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశం ఎప్పుడో పూర్తయ్యిందని.. రత్నకుమార్ అనే వ్యక్తి కావాలనే ఇలా చేస్తున్నాడని అంటున్నట్లు సమాచారం. ఈ విషయమై కేఏ పాల్ పోలీసులకు పిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ విషయంపై ఇరు వర్గాల మద్య సంప్రదింపులు నడుస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: సాయి ప్రియ ప్రియుడు రవి తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!