Job Notification: ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వైద్య,ఆరోగ్యశాఖలో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు 4,775 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, ప్రభుత్వం ఈ నియామకాలను కాంట్రాక్ట్ పద్దతిలో చేపట్టింది. ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు పక్రియ ఈనెల 7న ప్రారంభం కానుంది. ఈ నెల 16 చివరి తేదీ.
జోన్ల వారీగా ఖాళీల వివరాలు:
జోన్-1(విశాఖపట్నం) 974, జోన్-2(రాజమండ్రి)-1446జోన్-3(గుంటూరు)-967, జోన్-4(కడప)-1368
విద్యార్హతలు : బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి. అంతేకాకుండా, ఏపీ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిష్ట్రర్ అయి ఉండాలి. కమ్యూనిటీ హెల్త్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 35 ఏళ్లలోపు ఉండాలి.
పూర్తి వివరాలు.. అప్లై చేసుకోవటానికి..
hmfw.ap.gov. in … cfw.ap.nic. in వెబ్ సైట్లను చూడండి.
ఇవి కూడా చదవండి : మా తమ్ముడు మంత్రి అవుతాడు!: డిప్యూటీ సీఎం ధర్మాన
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.