తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి గురించి రాజకీయలపై ఆసక్తి ఉన్నవారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రత్యర్థి పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతూ ఫైర్ బ్రాండ్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇలా సీరియస్ పాలిటిక్స్ తో బిజీ బిజీగా ఉండే జేసీ ప్రభాకర్ రెడ్డి..డ్యాన్స్ చేశారు. అది కూడా మాములు డ్యాన్స్ కాదు.. ఊరా మాస్ డ్యాన్స్ చేస్తూ అభిమానులను, కార్యకర్తలను ఉత్సాహ పరిచారు.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి గురించి రాజకీయలపై ఆసక్తి ఉన్నవారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రత్యర్థి పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతూ ఫైర్ బ్రాండ్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందారు. అలానే నిత్యం ప్రజలతో కలుస్తూ..వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఇలా సీరియస్ పాలిటిక్స్ తో బిజీ బిజీగా ఉండే జేసీ ప్రభాకర్ రెడ్డి..డ్యాన్స్ చేశారు. అది కూడా మాములు డ్యాన్స్ కాదు.. ఊరా మాస్ డ్యాన్స్ చేస్తూ అభిమానులను, కార్యకర్తలను ఉత్సాహ పరిచారు. జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన మాస్ డ్యాన్స్ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా కొనసాగుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి అధికార పార్టీ నేతలపై, అధికారులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంటారు. అలానే టీడీపీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను తాడిపత్రి నియోజవర్గంలో నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర తాడిపత్రి చేరుకుంది. ఈ క్రమంలో జేసీ భారీగా తన అనుచరులతో కలిసి లోకేశ్ కి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన తన అభిమానులతో కలిసి చిందులేశారు. వయసు మీద పడ్డా జేసీ ప్రభాకర్ రెడ్డిలో జోష్ తగ్గలేదు. తీన్మార్ డప్పు చప్పుళ్లు చెవిన పడగానే ఆయనలోని ఒరిజినాలిటీ బయటకొచ్చింది. దీంతో తన అభిమానులతో కలిసి రోడ్డుపైనే చిందేశారు. చుట్టూ ఉన్నవాళ్లకు తనలోని కళను జేసీ ప్రభాకర్ రెడ్డి పరిచయం చేశారు. ఆయన భవిరి గడ్డంతో నెత్తిన తలపాగా చుట్టి.. చేతులు అటూ ఇటూ ఊపుతూ.. డ్యాన్స్ జర్క్‌లు ఇచ్చారు. ఒకవైపు టీడీపీ నేతల జోష్ ఇలా ఉంటే.. తాడిపత్రి నియోకవర్గంలో యువగళం పాదయాత్ర విషయంలో పోలీసులు నోటీసులు జారీ చేశారు.
యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ ను తాడిపత్రి డీఎస్పీ చైతన్య కలిశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని 149 సీఆర్పీసీ కింద లోకేశ్ కు పోలీసులు నోటీసులు అందించారు. తాడిపత్రి ఫ్యాక్షన్ నేపథ్యంలో ఉన్న ప్రాంతం.. కాబట్టి ఇక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జేసీ ప్రభాకర్ రెడ్డి మాస్ డ్యాన్స్ తెగ వైరల్ అవుతోంది. మరి.. జేసీ డ్యాన్స్ ను మీరు వీక్షించి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.