ఈ మద్య కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువగా పెరిగిపోతున్నాయి. నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ఈ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వాలు భద్రతా చర్యలు గట్టిగానే చేబడుతున్నా.. కొంత మంది డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనో.. మరే ఇతర కారణాల వల్లనో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్‌లోని కారు ప్రమాదం జరిగింది. కాసేపల్లి టోల్ ప్లాజా దగ్గర డివైడర్ కి ఢీ కొని అదుపు తప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకు వెళ్లింది కారు.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. నారా లోకేష్ వస్తున్నందున తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం పర్యటనకు బయల్దేరారు. ఇదే సమయంలో జేసీ కాన్వాయ్‌లోని ఓ కారు అదుపు తప్పింది.
కాగా, ఎయిడెడ్ కాలేజీల రద్దుపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ అనంతపురంలో నిరసన తెలుపుతున్న విద్యార్థులకు జేసీ మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. విద్యార్థులను పోలీసులు కొట్టడం దారుణమని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.