ఏపీ పర్యాటకశాఖ మంత్రి రోజా ప్రారంభించిన మంచి నీళ్ల ట్యాంకర్‌పై జనసేన నాయకుడు, సినీనటుడు నాగబాబు కామెంట్స్ చేశారు. రాయలసీమ ప్రజల దాహార్తిని తీర్చిన వైసీపీ (మాయ) పార్టీ నాయకురాలు రోజా అంటూ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ఇంకా..
ఏపీ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజూకు రసవత్తరంగా మారుతున్నాయి. నిత్యం అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే అధికార పార్టీని జనసేన సైతం తీవ్ర స్థాయిలో విమర్శిస్తుంది. ఇంకా చెప్పాలంటే అసలు జరుగుతున్న రాజకీయ యుద్ధం వైసీపీకి, జనసేనకు మధ్య అన్నట్లు ఉంది. సభవేదికలపైనే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శించుకుంటున్నారు. ఇక జనసేన నాయకుడు, సినీ నటుడు నాగబాబు సైతం తరచూ వైసీపీ మంత్రులపై, ఎమ్మెల్యేలపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తుంటారు. తాజాగా మంత్రి రోజా ప్రారంభించిన మంచి నీళ్ల ట్యాంకర్ పై నాగబాబు సెటైర్లు వేశారు. రాయలసీమ జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చిన వైసీపీ పార్టీ నాయకురాలు రోజా అంటూ ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఇటీవలే తన సొంత నియోజకవర్గంలో వాటర్ ట్యాంక్ ను ప్రారంభించారు. ఫిబ్రవరి 7వ తేదీన నగరి నియోజవర్గంలో నిండ్ర మండలం బీజీ కండ్రిక, ఎంసీ కండ్రిక గ్రామంలో రోజా పర్యటించారు. ” గడపగడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో రూ.11 లక్షల నిధులతో నిర్మించిన తాగునీటి బోరు, పైపులైన్లకు మంత్రి రోజా పూజ చేసి ప్రారంభించారు. అయితే రోజా చేసిన నీటి ట్యాంకర్ ప్రారంభోత్సవాన్ని ప్రస్తావిస్తూ జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, సినీ నటుడు నాగబాబు ఎద్దేవా చేశారు. హంద్రీనీవా సుజలా స్రవంతి ప్రారంభించిన మంత్రి రోజా అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
నిండ్ర మండలంలో #గడప_గడపకు_మన_ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరైన 11 లక్షల నిధులతో మంజూరు చేసిన త్రాగునీటి బోరు మరియు పైపులైన్లకు ఈరొజు పూజ చేసి ప్రారంభించడం జరిగింది గ్రామంలో ఇలా ప్రతిరోజు పండుగ వాతావరణంలో ప్రజలతో గడపడం ఎంతో సంతోషం కల్గించింది. #YSJaganAgain #YSJaganMarkGovernance pic.twitter.com/13i2FtZT3x
— Roja Selvamani (@RojaSelvamaniRK) February 7, 2023
చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల ప్రజల దాహార్తి ని తీర్చిన వైసీపీ(మాయ)పార్టీ నాయకురాలు రోజా! అంటూ ఆమె నీటి ట్యాంక్ ప్రారంభించిన ఫోటోలను పోస్ట్ చేశారు. రోజా గారు ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమలోని 6.025 లక్షల ఎకరాలకి సాగునీరు, 33 లక్షల మందికి త్రాగునీరు అందినట్లు సమాచారంటూ నాగబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ట్విట్ ద్వారా రాయలసీమ వాసుల ఎన్నో ఏళ్ల కలైనా హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి కాకపోవడంపై ఆయన పరోక్షంగా సెటైర్ వేశారు. ఇక నాగబాబు ట్వీట్ కు మద్దతుగా జనసైనికులు కూడా స్పందిస్తూ మంత్రి రోజాపై సెటైర్లు పేలుస్తున్నారు. అయితే ఆమెకు మద్దతుగా కూడా మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. మంత్రి రోజాపై జనసేన నాయకుడు నాగబాబు చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
హంద్రీనీవా సుజలా స్రవంతి (H N S S) ప్రారంభించిన రోజా @RojaSelvamaniRK
చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల ప్రజల దాహార్తి ని తీర్చిన వైసీపీ(మాయ)పార్టీ నాయకురాలు రోజా!
ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమలోని 6.025 లక్షల ఎకరాలకి సాగునీరు, 33 లక్షల మందికి త్రాగునీరు అందినట్లు సమాచారం. pic.twitter.com/PXcD9tIurA
— Naga Babu Konidela (@NagaBabuOffl) February 11, 2023