ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల మధ్య సభలు, సమావేశాలు .. ఏడాది ముందే ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటి అయ్యారు. ఈ సీక్రెట్ భేటీని నాదెండ్ల మనోహర్ రివిల్ చేశారు.
ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల మధ్య సభలు, సమావేశాలు .. ఏడాది ముందే ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటి అయ్యారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ లో చంద్రబాబు నివాసంలో వీరి భేటీ జరిగింది. అయితే ఆ సీక్రెట్ భేటీలో ఏ మాట్లాడుకున్నారనేది అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది. ఈ భేటీపై నెలకొన్న ఉత్కంఠకు జనసేన పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ తెరదించారు.
ఆదివారం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా పవన్, చంద్రబాబు ల రహస్య భేటీని రివిల్ చేశారు. అలానే చంద్రబాబు, పవన్ భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికలకు పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నారని, అందులో భాగంగానే చంద్రబాబుతో భేటీ అయ్యారని మనోహర్ తెలిపారు. అంతేకాక ప్రజలకు నమ్మకమైన, వైసీపీకి ప్రత్యామ్నాయం ఏర్పాటుకు జనసేన పార్టీ ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండా ఉండేందుకే తమ నాయకుడు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేసేలా తమ పార్టీ కార్యాచరణ ఉంటుందని ఆయన అన్నారు. తాము పదవుల కోసం కాదని, ప్రజల కోసం పనిచేస్తామని నాదెండ్లఅన్నారు. భవిష్యత్‌లో పవన్, చంద్రబాబు మధ్య మరికొన్ని సమావేశాలు జరుగుతాయని ఆయన తెలిపారు. అలానే భవిష్యత్ లోజరగనున్న అన్ని పార్టీలు కలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు నాదెండ్ల మనోహర్. ఇకపోతే శనివారం చంద్రబాబు, పవన్ ల భేటీ ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది.
జనసేన అధినేత సడెన్ గా చంద్రబాబు నివాసానికి వెళ్లడం సంచలనం సృష్టిస్తోంది. ఇంత అకస్మాత్తుగా బాబుతో పవన్ ఎందుకు భేటీ అయ్యారని చాల మందికి సందేహాలు వ్యక్తమయ్యాయి. పొత్తులు, సీట్ల సర్దుబాటు కోసమేనా?. అసలు, చంద్రబాబుతో పవన్ కల్యాణ్ ఏం చర్చించారు? అంటూ చర్చలు కూడా జరిగాయి. చివరకు ఈ ఉత్కంఠకు నాదెండ్ల మనోహర్ తెరదించారు. మరి.. నాదెండ్ల చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెట్స్ రూపంలో తెలియజేయండి.