ఆంధ్రప్రదేశ్ లో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూ.లక్ష సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. రైతు భరోసా యాత్రలో భాగంగా కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి… రూ.లక్ష అందజేస్తూ వస్తున్నారు. ఈ మేరకు అనంతపురం జిల్లాలో ఈ యాత్రను పవన్ ఇటీవలే ప్రారంభించారు. ఈ క్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర శనివారం ఉదయం ప్రారంభమైంది. యాత్రలో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని మృతి చెందిన కౌలు రైతుల కుటుంబాలకు రూ.లక్ష చెక్కును అందజేస్తున్నారు. ఈ యాత్రలో చిన్న అపశృతి దొర్లింది.
ఇదీ చదవండి: కౌలు రైతు కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం చేసిన పవన్ కళ్యాణ్
బాధిత కౌలు రైతు కుటుంబానకి చెక్కు అందజేసి పవన్ బయటకు వచ్చారు. పనన్ కల్యాణ్ చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో గుమిగూడారు. పవన్ బయటకు వచ్చి కారు వద్దకు వెళ్తుండా అభిమానుల మధ్య స్వల్ప తోపులాట సంభవించింది. అభిమానులను కంట్రోల్ చేసే క్రమంలో ఓ పోలీసు అధికారి కింద పడిపోయారు. అది గమనించిన పవన్ కల్యాణ్ వెంటనే ఆగి ఆయనను పైకి లేపారు. ఆయనకు ఏం కాలేదని నిర్ధారించుకున్న తర్వాత ముందుకు కదిలారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఒక కానిస్టేబుల్ కుమారుడిగా పవన్ కు మొదటి నుంచి పోలీసులంటే అపారమైన గౌరవం. కుదురినప్పుడల్లా వారు పడే కష్టాన్ని, వారి పై ఉండే ఒత్తిడులను ప్రజలకు అర్థమయ్యేలా చెబుతూనే ఉంటారు. ప్రతి సభలోనూ పోలీసులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తుంటారు. ఇంక ఈ వీడియో చూసిన తర్వాత పవన్ అభిమానులు ఇందుకే మాకు పవన్ అంటే ప్రాణం.. ఆయన వ్యక్తిత్వానికి మేము ఎప్పటికీ భక్తులమే అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.