అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన నవరత్నాల పేరుతో ఇచ్చిన హమీలను.. అధికారంలోకి వచ్చాక నేరవేర్చేందుకు సిద్ధమైంది వైఎస్సార్సీపీ. ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానాలను దశల వారీగా నెరవేర్చుతోంది. వృద్ధాప్య ఫించనుతో పాటు పలు పెన్షన్లను పెంచింది జగన్ సర్కార్. ఇటీవల విద్యా దీవెన కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసింది. తాజాగా మరోసారి మహిళలకు శుభవార్త చెప్పింది.
గత ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు వైఎస్సార్సీపీ నవ రత్నాల పేరుతో కొన్ని హమీ పథకాలను తీసుకువచ్చింది. తాము అధికారంలోకి వస్తే వీటిని నెరవేరుస్తామని పేర్కొంది. అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానాలను దశల వారీగా నెరవేర్చుతోంది. ఇప్పటికే అవ్వలు, తాతలకు ఇచ్చే వృద్ధాప్య ఫించనుతో పాటు పలు పెన్షన్లను విడదల వారీగా పెంచుతోంది. ఇటీవల విద్యా దీవెన కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసింది. ఇప్పుడు జగన్ సర్కార్ మహిళలకు మరో శుభవార్త చెప్పింది. నేడు వైఎస్సార్ ఆసరా పథకం కింద ఏపీలోని పొదుపు సంఘాలకు (డ్వాక్రా) చెందిన మహిళలకు మూడో విడత సాయాన్ని విడుదల చేయనుంది. ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు డ్వాక్రా మహిళలకు నగదు జమ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వారికి రాసిన లేఖల్లో పేర్కొన్నారు.
ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించనున్న సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కి ఈ ప్ర్రక్రియను ప్రారంభిస్తారు. దీంతో డ్వాక్రా మహిళల అకౌంటల్లో డబ్బులు జమ కానున్నాయి. మూడో విడతలో భాగంగా డ్వాక్రా సంఘాల్లోని 78.94 లక్షల మంది మహిళలు లబ్ది పొందనున్నారు. మొత్తంగా రూ.6,419 కోట్ల ఆసరా సాయాన్ని విడుదల చేయనున్నారు. తాజాగా విడుదల చేయనున్న రూ.6,419.89 కోట్లతో కలిపి మూడు విడతల కింద మొత్తం కింద రూ.19,178 కోట్లు ఆసరా సాయాన్ని జగన్ సర్కార్ అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా పది రోజుల పాటు అనగా ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 5 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. మూడో విడత సాయాన్ని అందజేస్తున్న సందర్భంగా లబ్దిదారులైన మహిళలందరికీ ముఖ్యమంత్రి జగన్ లేఖలు రాశారు. 2019 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా.. పొదుపు సంఘాల పేరిట ఉండే రుణాల మొత్తాన్ని నాలుగు విడతల్లో మాపీ చేస్తున్నామని అన్నారు. ఇప్పుడు మూడో విడతలో భాగంగా డ్వాక్రా సంఘాల మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు.
ఆసరాను కూడా నవరత్నాల పథకంలో చేర్చామని.. అలాగే 2016లో రద్దైన సున్నావడ్డీ పథకాన్ని కూడా తిరిగి తీసుకొచ్చామన్నారు. మహిళల జీవనోపాధి, ఆదాయ అవకాశాలకు ఈ డబ్బును వినియోగించుకునేలా.. ఆర్థికంగా ఎదిగాలనే మంచి ఆలోచనతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని లేఖలో తెలిపారు. చేయూత, ఆసరా, సున్నా వడ్డీ పథకాలతో ఆర్థికాభివృద్ధికి కృషి చేశామన్నారు. డ్వాక్రా మహిళలకు ఆసరా పథకం కింద అందజేస్తున్న సాయం ఉపయోగించుకోవడంపై ఎలాంటి షరతులు లేవు. జగన్ సర్కార్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం.. మొదటి విడతగా 78.76 లక్షల మందికి రూ.6,318.76 కోట్లు చెల్లించింది. రెండో విడతగా 78.76 లక్షల మందికి మరో రూ.6,439.52 కోట్లు చెల్లించారు. ఇప్పుడు మూడో విడతగా.. 78.94 లక్షల మందికి మరో రూ.6,419.89 కోట్లు మూడో విడతగా అందజేస్తున్నారు. మూడు విడతలలో మొత్తం రూ.19,178.17 కోట్లు లబ్ధి చేకూరుతోంది. పది రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఇలా ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. వీరు నేరుగా లబ్ధిదారులతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు.