ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ కోసం పలు పథకాలు రచించింది.అనేక పథకాలను లబ్దిదారులకు అందజేస్తూనే ఉంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు అండగా నిలుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ కోసం పలు పథకాలు రచించింది. వాటిని దశల వారీగా అమలు చేస్తూ తమది మాటల ప్రభుత్వం కాదూ.. ప్రజా ప్రభుత్వం అని నిరూపిస్తుంది. ఇప్పటికే అనేక పథకాలను లబ్దిదారులకు అందజేస్తూనే ఉంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు అండగా నిలుస్తుంది. 2022 జనవరి నుండి ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన డీఏను 2.73 శాతం మంజూరు చేస్తూ.. ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. అదేవిధంగా బకాయిలు చెల్లించేందుకు కూడా ముందుకు వచ్చిన సంగతి విదితమే. తాజాగా మరోసారి ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.
ఏపీలోని జగన్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏ పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఆర్ఏను 12 నుండి 16 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇది కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్‌లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తించనుంది. పార్వతీపురం, పాడేరు, అమలాపురం, బాపట్ల, రాజమండ్రి, భీమవరం, నరసరావుపేట, పుట్టపర్తి, రాయచోటి జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులకు పెంపు వర్తించనుంది. ఈ వార్తతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.